
Telugu Times•7 Jul 2026
మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్యారియా యాప్ (Yaria App) రద్దు చేయాలన్న డిమాండ్‌తో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డితో భారత రాష్ట్ర సమితి రైతు ధర్నాకు పిలుపునిచ్చింది. ధర్నాకు హైదరాబాద్ నుంచి బయలుదేరే క్రమంలో మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy)ని బంజారాహిల్స్‌లోని నివాసంలో హౌస్ అరెస్ట్ (House arrest) చేశారు. ప్రశాంత్ రెడ్డిని గృహనిర్బంధం చేయడాన్ని కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao) ఖండించారు. ప్రశాంత్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి సంఘీభావం తెలిపారు. రైతుల తరపున ప్రశ్నించే నాయకులను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమని మండిపడ్డారు. యారియా కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బందిపడుతున్నారని, యారియా పంపిణీలో అమలుచేస్తున్న యాప్ విధానం రైతులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. రైతుల సమస్యలను లేవనెత్తిన వారిపై పోలీసులను ప్రయోగించడం దారుణమని ఆక్షేపించారు