మాజీ ప్రేమికులతో కలిసిపోయిన మిల్కీ బ్యూటీ.. చేతిలో చేయి వేసుకొని నడుస్తూ కనిపించిన తమన్నా
Actor ProfileActor

మాజీ ప్రేమికులతో కలిసిపోయిన మిల్కీ బ్యూటీ.. చేతిలో చేయి వేసుకొని నడుస్తూ కనిపించిన తమన్నా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మాజీ ప్రేమికులతో కలిసిపోయిన మిల్కీ బ్యూటీ.. చేతిలో చేయి వేసుకొని నడుస్తూ కనిపించిన తమన్నా-విజయ్ వర్మ
Zee Telugu28 Jun 2026
మాజీ ప్రేమికులతో కలిసిపోయిన మిల్కీ బ్యూటీ.. చేతిలో చేయి వేసుకొని నడుస్తూ కనిపించిన తమన్నా-విజయ్ వర్మ

Tamannaah Marriage:సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. అయితే విడిపోయిన తర్వాత మళ్లీ కలిసి కనిపించడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు అలాంటి చర్చే ప్రముఖ నటి తమన్నా భాటియా, నటుడు విజయ్ వర్మ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న తమన్నా, విజయ్ వర్మ జంట బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇద్దరూ తమ సంబంధాన్ని దాచకుండా పలుమార్లు కలిసి కనిపించారు. పలు ఇంటర్వ్యూల్లో కూడా ఒకరిపై ఒకరు అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆ తర్వాత మీడియా ముందు అఫీషియల్ గానే వాళ్ల ప్రేమను చెప్పేశారు. అయితే దాదాపు రెండు సంవత్సరాల పాటు కొనసాగిన వారి ప్రేమ ప్రయాణం ముగిసిందని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. బ్రేకప్ తర్వాత తమన్నా తన సినిమాలపై దృష్టి పెట్టగా, విజయ్ వర్మ కూడా తన ప్రాజెక్ట్‌లతో బిజీగా మారాడు. మరోపక్క విజయ్ వర్మ ఇంకో హీరోయిన్ ని ప్రేమిస్తున్నారు అన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే వీరిద్దరూ తమ వ్యక్తిగత జీవితంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా, విడిపోయారనే వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అయితే తాజాగా ఈ మాజీ ప్రేమికులు మరోసారి కలిసి కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో తమన్నా, విజయ్ వర్మ కలిసి నడుచుకుంటూ కనిపించారు. అంతేకాకుండా విజయ్ చేతిని పట్టుకుని తమన్నా ఒకే కారులో ఎక్కడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో బయటకు రావడంతో “ఇద్దరూ మళ్లీ కలిసిపోయారా?”, “ప్రేమకు మరో అవకాశం ఇచ్చారా?” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు అభిమానులు ఈ జంట మళ్లీ ఒక్కటైతే సంతోషమేనని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కొంతమంది ఇక పెళ్ళే మిగిలింది తమన్నా పెళ్లి ఎప్పుడు.. అని కామెంట్లు పెడుతున్నారు. ఇక విజయ్ వర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో

మ జ ప ర మ క లత కల స ప య న మ ల క బ య ట చ త ల చ య వ స క న నడ స త కన ప చ న తమన న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in