మొగుడు పెళ్ళాల గొడవల్లోకి స్టార్ హీరో.. 'సేవ్ ది టైగర్స్ 4' లో క్రేజీ ట్విస్ట్
Actor ProfileActor

మొగుడు పెళ్ళాల గొడవల్లోకి స్టార్ హీరో.. 'సేవ్ ది టైగర్స్ 4' లో క్రేజీ ట్విస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మొగుడు పెళ్ళాల గొడవల్లోకి స్టార్ హీరో.. 'సేవ్ ది టైగర్స్ 4' లో క్రేజీ ట్విస్ట్
Samayam Telugu31 Jul 2026
మొగుడు పెళ్ళాల గొడవల్లోకి స్టార్ హీరో.. 'సేవ్ ది టైగర్స్ 4' లో క్రేజీ ట్విస్ట్

తెలుగు డిజిటల్ వినోద రంగంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగర్స్'. వివాహ బంధం చుట్టూ తిరిగే సున్నితమైన హాస్యాన్ని, భార్యాభర్తల మధ్య వచ్చే ఈగోలను వినోదాత్మకంగా చూపిస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సిరీస్.. వరుసగా మూడు సీజన్లతో ఘన విజయాన్ని అందుకుంది. ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' వేదికగా విడుదలైన సీజన్ 3 సైతం ప్రేక్షకులను అమితంగా అలరించింది. మొదటి రెండు భాగాల తరహాలోనే మూడో సీజన్‌కు కూడా అద్భుతమైన స్పందన రావడంతో ఈ సిరీస్ షో రన్నర్, ప్రముఖ దర్శకుడు మహి వి. రాఘవ్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీజన్ 3 ముగింపులో చూపించిన 'కాస్మిక్ ట్విస్ట్' ప్రేక్షకులను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఈ మలుపు సిరీస్ కథను మరో సరికొత్త కోణంలోకి తీసుకెళ్లడంతో, కథాంశంపై వీక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ భారీ విజయాల జోష్‌తో మేకర్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తదుపరి భాగమైన 'సేవ్ ది టైగర్స్' సీజన్ 4 ( Save The Tigers Season 4 )కు సంబంధించిన సన్నాహాలను అప్పుడే ప్రారంభించేశారు. నాలుగో భాగాన్ని మునుపటి కంటే మరింత భారీ స్థాయిలో, ఎంతో వైభవంగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.* ఓటీటీలో ‘సేవ్ ది టైగర్స్ 3’ సరికొత్త రికార్డులు.. సౌత్ డిజిటల్ స్పేస్‌ను షేక్ చేస్తున్న మహి వి రాఘవ్ కథలోకి స్టార్ హీరో ఎంట్రీఅయితే ఈ నాలుగో సీజన్‌కు సంబంధించి ఒక అద్భుతమైన వార్త ప్రస్తుతం సినీ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రేజీ సిరీస్‌లోకి టాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ హీరోని రంగంలోకి దించేందుకు లీడ్ టీమ్ గట్టి ప్రయత్నాలు చేస్తోందట. పెళ్లయిన మూడు వేర్వేరు జంటల మధ్య ఉండే చిన్నపాటి గొడవలు, సరదా సంభాషణలు, ఈగో క్లాషెస్‌తో సాగే ఈ పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఒక

మ గ డ ప ళ ళ ల గ డవల ల క స ట ర హ ర స వ ద ట గర స 4 ల క ర జ ట వ స ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in