మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్
Actor ProfileActor

మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema12 Aug 2026
మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

రామ్ చరణ్ నటించిన “పెద్ది” (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి ఫలితం ఏంటో తేలిపోయింది. వసూళ్ల పరంగా పెద్ద ఫిగర్ కనిపిస్తున్నా తెలుగులో తప్ప మిగతా ఏ భాషలో కూడా నామమాత్రంగా కూడా ఆడలేదు. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పెద్ద ఎత్తున విడుదల చేశారు. ఈ సినిమా హిందీ వెర్షన్ 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ప్రభాస్ వంటి హీరోల సినిమాల మొదటి రోజు హిందీ కలెక్షన్లు అని చెప్పుకోవచ్చు. ఇక తమిళంలో, మలయాళంలో రెండు, రెండు కోట్లు కలెక్ట్ చేసింది. మలయాళంలో 30 లక్షల రూపాయల వసూళ్లు సాధించింది. మొత్తంగా ఈ నాలుగు భాషల్లో కలిపి ఈ సినిమా దాదాపు 30 కోట్లు కలెక్ట్ చేసింది. ఇతర భాషల ప్రొమోషన్ కే 20 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే వచ్చింది ఏమీ లేదు. తెలుగులో మాత్రం బాగా ఆడింది.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా భారీ వసూళ్లు పొందింది. తెలంగాణాలో కూడా డీసెంట్ గా ఆడింది. అందుకే, ఒవరాల్ ఫిగర్ (ప్రపంచవ్యాప్తంగా 330 కోట్ల గ్రాస్) పెద్దగా కనిపిస్తోంది. రామ్ చరణ్ కి ఇది ఒక ఊరట. కానీ బ్లాక్ బస్టర్ కాదు