మెక్సికో అడవుల్లో అద్భుతం.. 1
Actor ProfilePolitician

మెక్సికో అడవుల్లో అద్భుతం.. 1

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మెక్సికో అడవుల్లో అద్భుతం.. 1,000 ఏళ్ల తర్వాత బయటపడిన ప్రాచీన నగరం
Andhra Jyothy19 Jul 2026
మెక్సికో అడవుల్లో అద్భుతం.. 1,000 ఏళ్ల తర్వాత బయటపడిన ప్రాచీన నగరం

దక్షిణ మెక్సికోలోని దట్టమైన అడవుల్లో, వెయ్యి సంవత్సరాలకు పైగా నిక్షేపంగా ఉన్న ఒక రహస్య మాయా నగరం బయటపడింది. ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ముఖ్యమైన పురాతన ఆవిష్కరణలలో ఇది ఒకటని నిపుణులు పేర్కొంటున్నారు. మెక్సికో సిటీ, జూన్ 25: చారిత్రక పరిశోధనల్లో సరికొత్త అధ్యాయం లిఖిస్తూ.. దక్షిణ మెక్సికోలోని దట్టమైన అడవుల లోపల వెయ్యి సంవత్సరాలకు పైగా ఎవరి కంటికీ పడకుండా దాగున్న ఒక ప్రాచీన 'మాయా' నగరం వెలుగుచూసింది. ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత కీలకమైన పురాతన ఆవిష్కరణలలో ఒకటిగా నిపుణులు దీనిని అభివర్ణిస్తున్నారు. మెక్సికోలోని కాంపెచే (Campeche) రాష్ట్రంలో ఉన్న 'కలాక్‌ముల్ బయోస్పియర్ రిజర్వ్' అనే మారుమూల అటవీ ప్రాంతంలో ఈ నగరాన్ని కనుగొన్నారు. ఈ నగరానికి 'మినాన్‌బే' (Minanbe) అని పేరు పెట్టారు. యుకాటెక్ మాయా భాషలో దీనికి 'దారి లేని చోటు' అని అర్థం. ఈ నగరానికి చేరుకోవడానికి పరిశోధక బృందం ఎంతటి కఠినమైన సవాలును ఎదుర్కొందో ఈ పేరే తెలియజేస్తోంది. మెక్సికో, స్లోవేనియా దేశాలకు చెందిన ఉమ్మడి పరిశోధక బృందం ఈ అద్భుత నగరాన్ని కనుగొంది. స్లోవేనియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ ఆర్ట్స్ పరిశోధనా కేంద్రానికి చెందిన ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త ఇవాన్ స్రాజ్క్ (Ivan Sprajc) నాయకత్వంలో, సెంట్రల్ మాయా లోలాండ్స్‌లో గత మూడు దశాబ్దాలుగా సాగుతున్న పరిశోధనలకు ఈ ఆవిష్కరణ ఓ మకుటాయమానంగా నిలిచింది. మెక్సికో జాతీయ మానవశాస్త్ర, చరిత్ర సంస్థ (INAH) అనుమతితో ఈ యాత్రను చేపట్టారు. పరిశోధకులు దట్టమైన అడవులను నరుక్కుంటూ, ఆల్-టెర్రైన్ వాహనాలు (ATVs), కాలినడకన తీవ్రమైన ఉష్ణమండల వాతావరణాన్ని తట్టుకుంటూ ఈ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారికి లభించిన నిర్మాణాలు అబ్బురపరిచాయి. భారీ పిరమిడ్ దేవాలయం: ఓ నాలుగు అంతస్తుల భవనం ఎత్తుతో.. దాదాపు 43 అడుగుల ఎత్తైన పిరమిడ్ దేవాలయం ఇక్కడ కనిపించింది. ఇది 7 నుంచి 12వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ 'రియో

మ క స క అడవ ల ల అద భ త 1 Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in