
ప్రతి నెలా రూ.3,000 చొప్పున EPFలో జమ చేస్తే, ఏడాదికి మొత్తం రూ.36,000 పెట్టుబడి అవుతుంది. ఈ విధంగా 25 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా చెల్లిస్తే, మొత్తం మీరు జమ చేసిన మొత్తం రూ.9 లక్షలు అవుతుంది. అయితే ఇది కేవలం మీ పెట్టుబడి మాత్రమే. దీనికి ప్రతి ఏడాది లభించే 8.25 శాతం వడ్డీ చక్రవడ్డీ రూపంలో చేరుతూ ఉండటంతో చివరికి రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో నిధి సిద్ధమవుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 8.25 శాతం వార్షిక వడ్డీ రేటు, ప్రతి నెలా నిరంతర పెట్టుబడి కొనసాగుతుందనే అంచనాతో లెక్కిస్తే, 25 సంవత్సరాల తర్వాత మొత్తం కార్పస్ సుమారు రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇందులో మీరు జమ చేసిన మొత్తం రూ.9 లక్షలు కాగా, వడ్డీ రూపంలోనే దాదాపు రూ.21 లక్షల నుంచి రూ.23 లక్షల వరకు లభించే అవకాశం ఉంది. అంటే మీ పెట్టుబడికంటే రెండింతలకు పైగా మొత్తం చక్రవడ్డీ ద్వారా సమకూరుతుంది. EPFలో మొదటి కొన్నేళ్లలో వడ్డీ పెద్దగా కనిపించకపోయినా, ఖాతాలో నిల్వ పెరిగే కొద్దీ ప్రతి ఏడాది వచ్చే వడ్డీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ వడ్డీపైనే మళ్లీ వడ్డీ చేరడం వల్ల చక్రవడ్డీ ప్రభావం ఏర్పడుతుంది. అందుకే ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన వెంటనే EPFలో క్రమం తప్పకుండా పొదుపు కొనసాగించే వారికి రిటైర్మెంట్ సమయానికి మంచి ఆర్థిక భద్రత లభిస్తుంది. మధ్యలో విరామం లేకుండా పెట్టుబడి కొనసాగించడం వల్లే ఈ ప్రయోజనం మరింత పెరుగుతుంది. అందుకే చిన్న చిన్న అవసరాలకు పీఎఫ్ అమౌంట్‌ను విత్‌డ్రా చేయకూడదని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. 2021 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి EPF, VPF కలిపి రూ.2.5 లక్షలకు మించి చెల్లించిన మొత్తంపై వచ్చే వడ్డీకి పన్ను వర్తిస్తుంది. అయితే ఈ