
పది రోజులైనా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించలేదు. నెగెటివ్ కామెంట్లు పెట్టవద్దని తల్లి వేడుకోలు. ఆచూకీ తెలిపితే లక్ష రూపాయల రివార్డు. Gnaneswari Missing Case: కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి(Gnaneswari Missing Case) అదృశ్యమై పది రోజులవుతున్నా ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పాప కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి అన్ని ప్రాంతాల్లోనూ తీవ్రంగా గాలిస్తున్నాయి. అయితే, ఈ కష్టసమయంలో సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారాలు, నెగెటివ్ కామెంట్లు తమను మరింత కృంగదీస్తున్నాయని చిన్నారి తల్లి భవానీ కన్నీటిపర్యంతమయ్యారు. తమ బిడ్డ క్షేమంగా తిరిగి వస్తుందనే నమ్మకంతో ఉన్నామని, దయచేసి తమ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా అసత్యపు వీడియోలు, బ్యాడ్ న్యూస్ పెట్టవద్దంటూ ఆమె చేతులు జోడించి వేడుకున్నారు. వారం రోజులుగా తిండి, నిద్ర లేకుండా తాము పడుతున్న నరకాన్ని అర్థం చేసుకోవాలని, వీలైతే పాప క్షేమంగా రావాలని కోరుకోవాలే తప్ప ఎక్కడో ఉండి ఏదేదో ఊహించుకుని బాధాకరమైన కామెంట్లు పెట్టవద్దని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. Petrol Diesel Prices: తెరుచుకున్న హార్ముజ్ జలసంధి.. భారీగా తగ్గుతున్న క్రూడ్ ఆయిల్.. భారత్ లో పెట్రోల్, వంటగ్యాస్ ధరల తగ్గుతాయా? మరోవైపు ఈ అదృశ్యం కేసును కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ స్వయంగా పర్యవేక్షిస్తూ ఘటనా స్థలిని పరిశీలించారు. పాప కిడ్నాప్ అయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నప్పటికీ, అందుకు సంబంధించిన ఎలాంటి ప్రాథమిక ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని ఎస్పీ స్పష్టం చేశారు. చిన్నారిని ఏదైనా క్రూర మృగం లాక్కెళ్లి ఉండవచ్చనే కోణంతో పాటుగా సాధ్యమైన అన్ని మార్గాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశామని ఆయన తెలిపారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీని కనిపెట్టి సమాచారం అందించిన వారికి ప్రభుత్వం తరఫున ఒక లక్ష రూపాయల నగదు రివార్డును కూడా ప్రకటించారు. ఈ కేసులో అత్యంత కీలకమైన అంశంగా