
Maa Inti Bangaram 2: మా ఇంటి బంగారం విజయంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రెండో భాగంలో హీరోయిన్ ఎంపికపై వస్తున్న వార్తలు ప్రస్తుతం అధికారికంగా ధృవీకరించబడలేదు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పటికే దాదాపు రూ.70 కోట్లకు చేరువలో గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సినిమా విజయోత్సవ వేడుకలో నిర్మాత రాజ్ నిడిమోరు మాట్లాడుతూ ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. కథకు సంబంధించిన ప్రాథమిక లైన్ కూడా సిద్ధంగా ఉందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ప్రకటనతో 'మా ఇంటి బంగారం 2' పై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈసారి కథను మరింత పెద్ద స్థాయిలో రూపొందించే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తి స్థాయి సీక్వెల్‌గా ఉంటుందా? లేక సమంత పాత్ర గతాన్ని చూపించే ప్రీక్వెల్‌గా తెరకెక్కుతుందా? అనే అంశాలపై కూడా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తల నేపథ్యంలో రెండో భాగంలో ఆమె నటిస్తారా లేదా అనే ప్రశ్న కూడా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో మరో స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారానికి కారణం నిర్మాత రాజ్ నిడిమోరు గతంలో చేసిన వ్యాఖ్యలే. 'మా ఇంటి బంగారం' ప్రారంభ దశలో హీరోయిన్‌గా మొదట సాయిపల్లవినే అనుకున్నామని, కానీ ఆమె ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో చివరకు సమంతను ఎంపిక చేశామని ఆయన వెల్లడించారు. దీంతో ఇప్పుడు రెండో భాగంలో సాయిపల్లవి నటించే అవకాశముందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సమంతే