మహాసముద్రంలో త్రిశూలం వ్యూహం.. అమ్ములపొదిలో సరికొత్త అస్త్రాలు
Actor ProfilePolitician

మహాసముద్రంలో త్రిశూలం వ్యూహం.. అమ్ములపొదిలో సరికొత్త అస్త్రాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మహాసముద్రంలో త్రిశూలం వ్యూహం.. అమ్ములపొదిలో సరికొత్త అస్త్రాలు
Oneindia Telugu23 Jun 2026
మహాసముద్రంలో త్రిశూలం వ్యూహం.. అమ్ములపొదిలో సరికొత్త అస్త్రాలు

భారత రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. సముద్ర గర్భంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేందుకు, భారత జలాలపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఒకేసారి మూడు అత్యాధునిక స్వదేశీ యుద్ధనౌకలు భారత నౌకాదళం (ఇండియన్ నేవీ) లోకి ప్రవేశించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడు యుద్ధనౌకలను జాతికి అంకితం చేశారు. ఇందులో అడ్వాన్స్‌డ్ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్‌ఎస్ దూనగిరి’ (INS Dunagiri), లార్జ్ సర్వే వెసల్ ఐఎన్‌ఎస్ సంశోధక్’ (INS Sanshodhak), యాంటీ సబ్‌మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్‌ఎస్ అగ్రయ్’ (INS Agray) ఉన్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ ఫ్రంట్‌లైన్ నౌకల చేరికతో భారత నావికాదళ పోరాట పటిమ, సముద్ర రక్షణ సామర్థ్యం అసాధారణంగా పెరగనుంది.కోల్‌కతా జీఆర్‌ఎస్‌ఈ అద్భుత సృష్టి.. శత్రువులకు సింహస్వప్నం!ఇండియన్ నేవీకి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో’ రూపకల్పన చేయగా.. కోల్‌కతాకు చెందిన ప్రముఖ రక్షణ రంగ ప్రభుత్వ సంస్థ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్’ (GRSE) ఈ మూడు నౌకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. నౌకాదళ బ్యాలెన్స్‌డ్ అప్రోచ్‌కు అద్దం పట్టేలా నిర్మితమైన ఈ మూడు నౌకలు సముద్ర పోరాటాలు, హైడ్రోగ్రాఫిక్ సర్వేలు, , జలాంతర్గామి నిరోధక చర్యల్లో కీలక పాత్ర పోషించనున్నాయి.ఐఎన్‌ఎస్ దూనగిరి (INS Dunagiri): ఇది ప్రాజెక్ట్ 17A’ కింద తయారైన ఐదో స్టెల్త్ ఫ్రిగేట్. శత్రువుల రాడార్లకు చిక్కకుండా దూసుకెళ్లే ఈ నౌకలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ (BrahMos) ఉపరితలం-నుంచి-ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, అలాగే మీడియం రేంజ్ ఉపరితలం-నుండి-గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలను అమర్చారు. ఇది నేవీ ఫైటింగ్ కెపాసిటీని ఊహించని స్థాయికి తీసుకెళ్తుంది. INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..