
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana Govt Key Decision: రాష్ట్రంలోని ఒంటరి మహిళలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. వచ్చే నెల నుంచి ఒంటరి మహిళలకు పెన్షన్లు అందించే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మహిళ ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు గత ఏడాదిలో రూ. 61 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించడంతోపాటు.. రూ. 14 కోట్ల వడ్డీ భారం ప్రభుత్వమే భరించిందన్నారు. మహిళలు కేవలం ఉద్యోగాలకు మాత్రమే పరిమితం కాకుండా.. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో కూడా రాణించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో పర్యాటకం, ఆహార ఉత్పత్తులు, చేతివృత్తులు, సేవారంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని.. మహిళలు వాటిని వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి సీతక్క. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం వివిధ కేటగిరీల కింద 42 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా.. వారిలో నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా నిధులు పొందుతున్న వారు 19 లక్షల 4 వేల 239 మంది ఉన్నారు. అయితే, కేవలం అర్హులైన వారికి మాత్రమే పెన్షన్లు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రక్షాళన మొదలు పెట్టింది. లబ్ధిదారుల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు, నిధుల దుర్వినియోగం అవుతోందనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్లలో అనర్హులను ఏరివేసేందుకు రాష్ట్ర పేదరిక