మహానటి’కి ఆమె సహాయం ఎంతో ఉపయోగపడింది
Actor ProfileActor

మహానటి’కి ఆమె సహాయం ఎంతో ఉపయోగపడింది

Total News1
Movie Updates0
Sources1
మహానటి’కి ఆమె సహాయం ఎంతో ఉపయోగపడింది
Eenadu16 Jun 2026
మహానటి’కి ఆమె సహాయం ఎంతో ఉపయోగపడింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మహానటి’ (Mahanati) సినిమాలో సావిత్రి పాత్రను పోషించడానికి, ఆమె కుమార్తె తనకు ఎంతగా సహాయపడ్డారో సినీనటి కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) వెల్లడించారు. సావిత్రి జీవితాన్ని తెరపై ప్రదర్శించడానికి చేసిన సన్నాహాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీర్తి పంచుకున్నారు. ‘‘ఈ సినిమా చేయడానికి ముందు సావిత్రి నటించిన ఎన్నో సినిమాలను క్షుణ్ణంగా పరిశీలించాను. కానీ, కేవలం నటనను చూసి తెర వెనుక ఆమె వ్యక్తిత్వం గురించి నాకు ఎలా తెలుస్తుంది?అనిపించింది. దీంతో ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరితో మాట్లాడాను. ఆమె నాతో ఎన్నో విషయాలను పంచుకున్నారు. వాటి ద్వారా మా ఇద్దరి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయని అర్థమైంది. అలాగే, షూటింగ్‌కు వచ్చినప్పుడు ఆమె తన వ్యక్తిగత జ్ఞాపకాలను నాతో పంచుకునేవారు. అవి నా మనసులో సావిత్రి పాత్రను తీర్చిదిద్దుకోవడానికి ఎంతగానో సహాయపడ్డాయి. ఒకసారి FMలో సావిత్రి గారు ఇచ్చిన ఇంటర్వ్యూ విన్నాను. అది కేవలం రెండు నిమిషాలే ఉన్నప్పటికీ, విన్నాక ఆమె వ్యక్తిత్వం గురించి మనసులో ఒక స్పష్టమైన చిత్రం ఏర్పడింది. ఆమె ఎంతో సరదాగా, సహజంగా ఉండేవారని, మంచి హాస్య చతురత కలిగినవారని అర్థమైంది. అంతేకాకుండా, సినిమాకు సంతకం చేసిన తర్వాత, నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు ‘ మీరు సావిత్రి గారి సినిమా చేస్తున్నారు కదా! మా అమ్మమ్మ ఆమె గురించి ఇలా చెప్పేవారు..’ అంటూ తమ అనుభవాలను పంచుకునేవారు. మా అమ్మకు కూడా ఆమె కథలు తెలుసు. ఇలా వాటన్నింటినీ జోడిస్తే నాకు అవగాహన వచ్చింది. ‘ఆమె వ్యక్తిత్వం బహుశా ఇలా ఉంటుంది. ఇక దీనికి నేను ఎలా ప్రాణం పోయాలి? అని ఆలోచించాను. కుటుంబ కథలు, వ్యక్తిగత జ్ఞాపకాలు, ఇంటర్వ్యూలు, సావిత్రి అభిమానులు పంచుకున్న కథలే ఆ దిగ్గజ నటి వ్యక్తిత్వాన్ని ఊహించుకోవడానికి నాకు సహాయడ్డాయి’’ అని కీర్తి వివరించారు. ‘మహానటి’ చిత్రంలో దిగ్గజ నటి సావిత్రిగా కీర్తి సురేశ్‌ నటన భారతీయ

మహ నట క ఆమ సహ య ఎ త ఉపయ గపడ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in