
పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శాంతి ఒప్పందం కుదురుతున్న దశలో అమెరికా-ఇరాన్‌లు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శాంతి ఒప్పందం కుదురుతున్న దశలో అమెరికా-ఇరాన్‌లు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇరాన్‌లోని సిరిక్, ఖెష్మ్ ద్వీపం ప్రాంతాలపై అమెరికా వరుసగా రెండో రోజు వైమానిక దాడులు నిర్వహించింది. దీంతో ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగినట్లు సమాచారం (Iran war live). బహ్రెయిన్, కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాల వైపు క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించింది. అయితే ఆ డ్రోన్లను, క్షిపణులను అడ్డుకునేందుకు రెండు దేశాల వైమానిక రక్షణ వ్యవస్థలు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో బహ్రెయిన్, కువైట్‌లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆయా దేశాల అధికారులు హెచ్చరికలు జారీ చేశారు (Bahrain, Kuwait air raid sirens). అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు (Trump Iran). కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులు కొనసాగిస్తే మరింత కఠినమైన సైనిక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ, అమెరికా చర్యలకు తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని ప్రకటించింది. ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు.. పలు సైనిక కేంద్రాలు ధ్వంసం