మరోసారి పేట్రేగిపోయిన ప్రిటోరియస్
Actor ProfileActor

మరోసారి పేట్రేగిపోయిన ప్రిటోరియస్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మరోసారి పేట్రేగిపోయిన ప్రిటోరియస్
Sakshi12 Aug 2026
మరోసారి పేట్రేగిపోయిన ప్రిటోరియస్

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో సౌతాఫ్రికా విధ్వంసకర వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ లువాన్‌ డ్రే ప్రిటోరియస్‌ చెలరేగిపోతున్నాడు. వరుసగా రెండో మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించి తన జట్టును (శాన్‌ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌) గెలిపించాడు. ఓక్‌లాండ్‌ వేదికగా వాషింగ్టన్‌ ఫ్రీడంతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 26 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. ఫలితంగా 191 పరుగుల భారీ లక్ష్యాన్ని యూనికార్న్స్‌ మరో 29 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ప్రిటోరియస్‌కు జతగా మరో ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ (18 బంతుల్లో 45; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), మాథ్యూ షార్ట్‌ (34 నాటౌట్‌), ఆరోన్‌ హార్డీ (42 నాటౌట్‌) కూడా చెలరేగారు. ఫ్రీడం బౌలర్లలో నిఖిల్‌ చౌదరి (4-0-29-1) మినహా అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అంతకుముందు ఫ్రీడం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆండ్రియస్‌ గౌస్‌ (83 నాటౌట్‌) అజేయ అర్ద సెంచరతో విరుచుకుపడ్డాడు. మిచెల్‌ ఓవెన్‌ (39), నిఖిల్‌ చౌదరి (32 నాటౌట్‌) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో పర్వాలేదనిపించారు. స్టీవ్‌ స్మిత్‌ (3), చాప్‌మన్‌ (17) నిరాశపరిచారు. యూనికార్న్స్‌ బౌలర్లలో షార్ట్‌, బ్రాడీ కౌచ్‌,, హరీస్‌ రౌఫ్‌, గులామ్‌ ముద్దస్సర్‌ తలో వికెట్‌ తీశారు. ఓర్కాస్‌పైనా విధ్వంసం ప్రిటోరియస్‌ సియాటిల్‌ ఓర్కాస్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ ఇదే తరహా విధ్వంసం సృష్టించాడు. 39 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేసి సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లోనూ ప్రిటోరియస్‌ మెరుపు ఇన్నింగ్స్‌ కారణంగానే యూనికార్న్స్‌ భారీ లక్ష్యాన్ని పెద్దగా కష్టపడకుండానే ఊదేసింది. 'రాజాసాబ్' బ్యూటీ అమ్మనాన్నని చూశారా? (ఫొటోలు) హైదరాబాద్ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ అంజలి (ఫొటోలు) విశాఖపట్నం : క్యాట్‌వాక్‌తో కెవ్వుకేక (ఫొటోలు) నెల్లూరు : రొట్టెల పండుగకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు) విశాల్ ‘మకుటం’ మూవీ సాంగ్ లాంచ్

మర స ర ప ట ర గ ప య న ప ర ట ర యస Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in