మరో విషాదం.. షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా తల్లి మృతి
Actor ProfilePolitician

మరో విషాదం.. షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా తల్లి మృతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మరో విషాదం.. షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా తల్లి మృతి
Andhra Jyothy12 Aug 2026
మరో విషాదం.. షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా తల్లి మృతి

భారత షూటింగ్ దిగ్గజం, పద్మశ్రీ అవార్డు గ్రహీత జస్పాల్ రాణా మృతి చెందిన కొద్ది రోజులకే ఆయన కుటుంబంలో మరో విషాదం నెలకొంది. జస్పాల్ తల్లి శ్యామా దేవి అనారోగ్యంతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంటర్నెట్ డెస్క్: భారత షూటింగ్ దిగ్గజం, పద్మశ్రీ అవార్డు గ్రహీత జస్పాల్ రాణా మృతి చెందిన కొద్ది రోజులకే ఆయన కుటుంబంలో మరో విషాదం నెలకొంది. జస్పాల్ తల్లి శ్యామా దేవి అనారోగ్యంతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జూన్ 12న జస్పాల్ రాణా అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కుమారుడి మరణం నుంచి ఇంకా కోలుకోని కుటుంబానికి ఈ ఘటన మరింత విషాదాన్ని మిగిల్చింది. శ్యామా దేవి రాణా మృతిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ‘జస్పాల్ రాణా తల్లి శ్యామా దేవి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నా. భగవంతుడు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు ఈ తీరని దుఃఖాన్ని భరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు. ప్లేయర్‌గా భారత షూటింగ్‌కు ఎన్నో విజయాలు అందించిన జస్పాల్ రాణా, కోచ్‌గా కూడా విశేష సేవలందించారు. పారిస్ ఒలింపిక్స్-2024లో మను భాకర్ రెండు కాంస్య పతకాలు గెలవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన మరణంతో క్రీడా రంగం తీవ్ర విషాదంలో మునిగిపోగా, కొద్ది రోజులకే తల్లి కూడా కన్నుమూయడంతో రాణా కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు మేము ఫ్రంట్‌పేజీ వార్తల్లో నిలుస్తాం: ఐర్లాండ్ కెప్టెన్ ఫిఫా ప్రపంచ కప్: రౌండ్ 16కు దూసుకెళ్లిన కెనడా

మర వ ష ద ష ట గ ద గ గజ జస ప ల ర ణ తల ల మ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in