మరో రూ.2 వేల కోట్లు
Actor ProfilePolitician

మరో రూ.2 వేల కోట్లు

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. మరో రూ.2 వేల కోట్లు విడుదల
Samayam Telugu18 Aug 2026
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. మరో రూ.2 వేల కోట్లు విడుదల

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల

మరో రూ.2 వేల కోట్లు
Eenadu18 Aug 2026
మరో రూ.2 వేల కోట్లు

ఉద్యోగుల బకాయిల కోసం విడుదల నెల రోజుల వ్యవధిలోనే రూ.4 వేల కోట్లు పింఛన్‌దారుల జీపీఎఫ్‌ బకాయిలు వందశాతం చెల్లింపు మా చిత్తశుద్ధి మరోసారి నిరూపితమైంది: ఉపముఖ్యమంత్రి భట్టి ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగులు, పింఛన్‌దారుల బకాయిల చెల్లింపుల కోసం మరో రూ.2 వేల కోట్లను విడుదల చేస్తూ ఆర్థికశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. గత నెల(మే) 29న మొదటి విడతగా రూ.2 వేల కోట్లు విడుదల చేయగా సరిగ్గా అదే తేదీన ఈ నెల కూడా ఇచ్చింది. మొత్తం రూ.4 వేల కోట్ల చెల్లింపు పూర్తయింది. ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీ మేరకు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపు కోసం 100 రోజుల్లో రూ.6,000 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఉద్యోగుల పట్ల మా చిత్తశుద్ధి మరోసారి నిరూపితమైంది. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ, ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, బకాయిల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేశాం. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆర్థికశాఖ తెలిపింది. అందులో భాగంగా రిటైర్డ్‌ ఉద్యోగులు, జిల్లా పరిషత్‌ ఉపాధ్యాయులకు సంబంధించి చాలాకాలంగా పెండింగులో ఉన్న జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (జీపీఎఫ్‌) బకాయిలను వంద శాతం చెల్లించింది. జీపీఎఫ్‌ ఖాతాల్లో ఎలాంటి పెండింగ్‌ బిల్లులు ఇక లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి సెప్టెంబరు 2025 వరకు ఉన్న కమ్యూటేషన్‌ బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించినట్లు వివరించింది. ఉద్యోగులు లేదా పింఛన్‌దారులు గతంలో ప్రభుత్వానికి పంపిన రూ.10 వేల లోపు ఉన్న దాదాపు 5 లక్షలకు పైగా బిల్లులను ప్రత్యేకంగా గుర్తించి వందశాతం చెల్లించినట్లు అధికారులు వివరించారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ, ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వ సానుకూల ధోరణి అభినందనీయమని కొనియాడారు. రాబోయే రోజుల్లో మిగిలిన బకాయిలను కూడా క్రమపద్ధతిలో చెల్లిస్తామని ఆర్థికశాఖ అధికారులు

మర ర 2 వ ల క ట ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in