మరో బంపరాఫర్ పట్టేసింది?
Actor ProfileActor

మరో బంపరాఫర్ పట్టేసింది?

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మరో బంపరాఫర్ పట్టేసింది? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema31 Jul 2026
మరో బంపరాఫర్ పట్టేసింది? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

కొందరికి అదృష్టం అలా పట్టేస్తుందంతే. రావడమే హిట్లు మీద హిట్లు కొడతారు, వరుసగా పెద్ద సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతారు. ప్రస్తుతం మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ఇదే పొజిషన్ లో ఉంది. తెలుగులో ఇప్పటికే మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అనిపించుకున్న మీనాక్షి, ఇప్పుడు మరోసారి తమిళనాట అడుగుపెట్టబోతోంది. ఈసారి ఏకంగా రజనీకాంత్ సినిమాలో అవకాశం అందుకుందంట. కమల్ హాసన్ నిర్మాతగా, రజనీకాంత్ హీరోగా ‘ధర్మాన్’ (Dharman) అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్లుగా రాశిఖన్నా, సిమ్రాన్ ను తీసుకున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని కూడా తీసుకున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతోంది మీనాక్షి. ఇప్పటికే ఆమె కోలీవుడ్ లో అడుగుపెట్టింది. విజయ్ సరసన ఓ సినిమా చేసింది. అయితే తెలుగు నుంచి వరుసగా ఛాన్సులు రావడంతో తమిళ సినిమా వైపు ఫోకస్ తగ్గించింది. ఇప్పుడు రజనీకాంత్ సినిమా ఆఫర్ కావడంతో వెంటనే ఓకే చేసినట్టు తెలుస్తోంది