
ఇంటర్నెట్ డెస్క్: మహేశ్ బాబు (Mahesh Babu) అభిమానులకు రాజమౌళి గుడ్‌న్యూస్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ‘వారణాసి’ (Varanasi) షూటింగ్ మరో నాలుగు నెలల్లో పూర్తవుతుందని వెల్లడించారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజువల్ వండర్‌గా ఉండబోయే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ అంతా పూర్తయిన్నట్లు తెలిపారు. ఫ్రాన్స్‌లో జరిగిన ‘ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్’లో పాల్గొన్న రాజమౌళి (SS Rajamouli) అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వారణాసిలో ముఖ్యమైన భాగాలను పూర్తిచేశాం. యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం కథను అనుసంధానం చేసే చిన్న చిన్న సన్నివేశాలను షూట్ చేస్తున్నాం. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటి వారానికల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది (Varanasi Update)’’ అని తెలిపారు. సినిమాను ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందించడంపై మాట్లాడుతూ.. ఈ కథ ఐమాక్స్‌లో అయితే అద్భుతంగా ఉంటుందని మొదటే అనుకున్నట్లు చెప్పారు. అయితే, ఈ ఫార్మాట్ కోసం మాత్రం ‘వారణాసి’ కథలో మార్పులు చేయలేదని, చిన్న చిన్న సర్దుబాట్లు చేసినట్లు వెల్లడించారు. ‘‘మన కళ్లు సినిమా స్కోప్ ఫార్మాట్‌లో షూట్ చేయడానికి అలవాటు పడ్డాయి. నాకు కూడా అది ఇష్టమే. అయితే, మొదటి నుంచి మేము అనుకున్నది ఏంటంటే, అటు ఐమ్యాక్స్, ఇటు సినిమా స్కోప్‌నకు సరిపోయేలా సన్నివేశాలను ఫ్రేమ్ చేయాలనుకున్నాం. అదే అనోమార్ఫిక్ ఫ్రేమింగ్ (సినిమా ప్రదర్శితమయ్యే స్క్రీన్‌కు అనుగుణంగా ఇమేజ్/వీడియో క్వాలిటీ దెబ్బతినకుండా పెద్దదిగా చేయడం) దీంతో తొలిరోజుల్లో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏది ఎలా చేయాలో మాకు అర్థమైంది. దీంతో పని సులభంగా అయిపోయింది’’ అని జక్కన్న చెప్పుకొచ్చారు. మహేశ్‌కు జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో కుంభ పాత్రలో నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల ఈ సినిమా గురించి మాట్లాడుతూ అంచనాలు పెంచేశారు. రాజమౌళి కొన్ని