మరిన్ని ఆర్థిక సంస్కరణలకు కేంద్రం సిద్ధం
Actor ProfilePolitician

మరిన్ని ఆర్థిక సంస్కరణలకు కేంద్రం సిద్ధం

Total News1
Movie Updates0
Sources1
మరిన్ని ఆర్థిక సంస్కరణలకు కేంద్రం సిద్ధం
Sakshi15 Jun 2026
మరిన్ని ఆర్థిక సంస్కరణలకు కేంద్రం సిద్ధం

గ్లోబల్ మార్కెట్‌లో తలెత్తుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, దేశీయంగా విదేశీ మూలధన ప్రవాహాన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) సంయుక్తంగా కీలక చర్యలు ప్రారంభించాయి. విదేశీ నిధులను తిరిగి భారత మార్కెట్ వైపు ఆకర్షించేందుకు తీసుకుంటున్న ఈ చర్యల్లో ఇది మొదటి అడుగని, రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ‘మైండ్ మైన్ సమ్మిట్ 2026’లో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ముడి చమురు, ఎరువులు, కీలక ముడి పదార్థాల దిగుమతుల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని, ఇలాంటి అభివృద్ధి చెందుతున్న ప్రపంచ పరిస్థితుల నుంచి ఉత్పన్నమయ్యే ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి మన బాండ్ మార్కెట్ ‘మంచి అయస్కాంతం’లా పనిచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ సంయుక్త విశ్లేషణలో తేలిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విదేశీ పెట్టుబడిదారులకు నిబంధనలను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ సెక్యూరిటీలలో విదేశీ ఇన్వెస్టర్లకు సమ్మతి భారాన్ని తగ్గించేందుకు గానూ, ‘ఫుల్లీ యాక్సెసబుల్ రూట్’ (ఎఫ్‌ఏఆర్‌) కింద నిర్దిష్ట సెక్యూరిటీల జాబితాను జూన్ 5న ప్రభుత్వం మరింత విస్తరించింది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల ద్వారా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఆర్జించే వడ్డీ, మూలధన లాభాల ఆదాయానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పించారు. ‘ప్రస్తుతానికి ఈ సంస్కరణలు బాండ్ మార్కెట్‌కే పరిమితమైనప్పటికీ దీని పరిధి విస్తరించనుంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దేశంలోకి మరిన్ని విదేశీ నిధులు రావాల్సిన అవసరాన్ని మేము గుర్తించాం’ అని సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. విదేశీ కరెన్సీ ప్రవాహాన్ని పెంచడంతో పాటు కరెన్సీ హెడ్జింగ్ రిస్క్‌ను తగ్గించడానికి ఆర్‌బీఐ జూన్ 5న బ్యాంకింగ్ రంగానికి