
సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో భాగంగా ఓటరు వివరాల నమోదుకోసం క్యూఆర్ కోడ్‌తో కూడిన ఎన్యుమరేషన్ పత్రాలను భారత ఎన్నికల సంఘం బూత్ స్థాయి అధికారుల (బీఎంల్‌వో) ద్వారా పౌరులకు... వివరాలు తప్పుగా రాస్తే ఏం చేయాలి?.. కొట్టివేసి అదే పత్రంలో మళ్లీ రాయొచ్చా? హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో భాగంగా ఓటరు వివరాల నమోదుకోసం క్యూఆర్ కోడ్‌తో కూడిన ఎన్యుమరేషన్ పత్రాలను భారత ఎన్నికల సంఘం బూత్ స్థాయి అధికారుల (బీఎంల్‌వో) ద్వారా పౌరులకు అందజేస్తోంది. మరి.. అందులో వివరాలను తప్పుగా నమోదు చేస్తే ఎలా? బీఎల్‌వోలు ఇచ్చిన ఫారం ఉపయోగపడే స్థితిలో లేకుండా చిరిగిపోయినా.. ఇంకా ఏమైనా జరిగితే ఏం చేయాలన్న దానిపై ప్రజల్లో సందేహాలున్నాయి. అంతే కాకుండా ఎన్యుమరేషన్ ఫారాల్లో వివరాల నమోదు సమగ్రంగా చేపట్టలేని స్థితిలో ఉన్నామంటూ గ్రామీణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో తలెత్తే అనుమానాలపై ప్రశ్నలు.. వాటిని సమాధానలు! ఎన్యుమరేషన్ పత్రంలో వివరాలు తప్పుగా నమోదు చేస్తే మరో పత్రం ఇస్తారా? ఇస్తారు. పత్రం పూర్తిగా తప్పుగా నింపినా, పేజీ చిరిగిపోయినా లేదంటే ఉపయోగించలేని స్థితిలో ఉన్నా, బీఎల్‌వోలు అవసరాన్ని బట్టి మరో పత్రాన్ని అందించవచ్చు. అయితే అవసరం లేకుండా పదేపదే కొత్త పత్రాలు మాత్రం ఇవ్వరు పత్రం స్వీకరించిన తర్వాత తప్పు గుర్తిస్తే ఏం చేయాలి? సాధ్యమైనంత త్వరగా సంబంధిత బీఎల్‌వో లేదంటే ఎన్నికల నమోదు అధికారిని సంప్రదించి విషయం తెలియజేయాలి. పరిశీలన దశలో ఉంటే అవసరమైన సవరణలు చేయడానికి అధికారులు సూచించే ప్రక్రియను అనుసరించాలి మరో పత్రంలోనూ మునుపటి క్యూఆర్ కోడ్ ఉంటుందా? ఎన్యుమరేషన్ పత్రాలపై ముద్రించిన క్యూఆర్ కోడ్ ప్రతి పత్రాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఒక పత్రం దెబ్బతిన్నా లేదంటే తప్పుగా వివరాలు నమోదు చేసినా ఎన్నికల అధికారులు తమ విధివిధానాల ప్రకారం మరో పత్రాన్ని జారీ చేయవచ్చు. అవసరమైతే సంబంధిత