
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Shukra Ketu Yuti In Leo 2026 Telugu News: జ్యోతిష్య శాస్త్ర పరంగా 2026 జూలై నెలలో ఒక కీలకమైన గ్రహ మార్పు చోటుచేసుకోబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జూలై 4వ తేదీన సంపద, వైభవానికి కారకుడైన శుక్ర గ్రహం తన రాశిని మార్చుకుని కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి సంచారం చేయబోతోంది.. అయితే, అప్పటికే సింహ రాశిలో మాయా గ్రహంగా పరిగణించే కేతువు గ్రహం సంచార దశలో ఉంది.. దీనివల్ల సింహ రాశిలో శుక్ర, కేతువుల అరుదైన కలయిక జరగబోతోంది. మఘా నక్షత్రంలోకి కేతువు ప్రవేశం.. జూలై 4వ తేదీన మరో ముఖ్యమైన మార్పు కూడా జరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కేతువు ఆశ్లేష నక్షత్రాన్ని వదిలిపెట్టి.. తన స్వంత నక్షత్రమైన మఘా నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. కేతువు నీడలోకి శుక్రుడు రావడం వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని శుభఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.. ముఖ్యంగా 4 రాశుల వారు ఈ గ్రహాల అనుగ్రహంతో జూలై నెల నుంచి ఆర్థికంగా, వృత్తిపరంగా అద్భుతమైన పురోగతిని సాధించబోతున్నారు. అయితే, ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మిథున రాశి: మిథున రాశి వారికి శుక్ర-కేతువుల కలయిక ఎంతో అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరి మాటతీరు మెరుగుపడటం వల్ల సమాజంలో వీరికి సంబంధించిన ప్రభావం పెరుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడి.. వ్యాపారాలు విస్తరించేందుకు మార్గాలు సుగమం అయ్యే అవకాశాలు ఉన్నాయి