
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Vishal Makutam:మకుటం సినిమాలోని పాట విడుదల కార్యక్రమంలో విశాల్ మాట్లాడుతూ దర్శకుడిగా మారడం తన కల అని చెప్పారు. చిన్నప్పటి నుంచి దర్శకత్వం వహించాలని అనుకున్నానని, ఇప్పుడు ఆ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమని, ఏడాది పాటు పూర్తిగా ఈ చిత్రంపైనే దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఈ ప్రయాణంలో తనపై నమ్మకం ఉంచిన ఆర్‌బీ చౌదరిని గుర్తు చేసుకున్నారు. ఆయన ఇచ్చిన బాధ్యతను సక్రమంగా పూర్తి చేశానని ఆశిస్తున్నానన్నారు. తనతో కలిసి పనిచేసిన ప్రతి నటుడు, సాంకేతిక నిపుణుడికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తాను పనిచేసిన దర్శకుల నుంచి నేర్చుకున్న అనుభవాన్ని ఈ సినిమాలో ఉపయోగించానని చెప్పారు. సినిమా గురించి ఎక్కువగా మాట్లాడనని, విడుదలైన తర్వాత ప్రేక్షకులే తీర్పు చెబుతారని విశాల్ అన్నారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుంచో తనకు మంచి ఆదరణ ఇస్తున్నారని, ఇప్పుడు దర్శకుడిగా కూడా వారి ప్రేమ దక్కాలని కోరుకుంటున్నానన్నారు. మకుటం ప్రతి ఒక్కరికీ మంచి సినిమా అనుభూతిని ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నటి అంజలి మాట్లాడుతూ విశాల్‌తో మళ్లీ కలిసి నటించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమాలో తన పాత్ర చాలా బలంగా ఉంటుందని చెప్పారు. విశాల్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని, ఆ కష్టానికి మంచి ఫలితం రావాలని కోరుకుంటున్నానన్నారు. జీవీ ప్రకాష్ అందించిన సంగీతం అద్భుతంగా ఉందని, నచ్చాకే వచ్చేరా పాట పెద్ద హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జితన్