
బాలయ్య బాబుగారి పుట్టినరోజు ఓ పండగ. బాలయ్య గారి స్ఫూర్తితో, ఆయనకు ఇష్టమైన సేవా కార్యక్రమాలను అభిమానులు కూడా బాధ్యతగా తీసుకుని ముందుకు తీసుకెళ్లడం అభినందనీయం: సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్య బాబుగారిని ప్రేమిస్తే నో బ్రేకప్స్... ఆ ప్రేమ జీవితాంతం ఉంటుంది: ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు అనంతపురం జగన్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు (జూన్ 10) వేడుకలు సందర్భంగా రూపొందించిన "భోళా బాలయ్య" సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ముఖ్య అతిథిగా హాజరై వేడుకకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చారు. అభిమానుల సందడి మధ్య ఈ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. భోళా బాలయ్య సాంగ్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. బాలయ్య గారు ఏంటనేది నేను నా సినిమాల ద్వారా చెప్పాను. ఈ సాంగ్ గురించి చెప్పాలంటే, పాట చాలా అద్భుతంగా వచ్చింది. మ్యూజిక్, లిరిక్స్, డ్యాన్స్, ఆర్టిస్టులు, అలాగే ఈ సాంగ్‌ను రూపొందించిన జగన్‌తో సహా అందరూ అద్భుతంగా కుదిరారు. ముఖ్యంగా విజువల్స్ అయితే చాలా గొప్పగా ఉన్నాయి. బాలయ్య గారి చిన్నప్పటి ఫొటోల నుంచి ఇప్పటివరకు ఉన్న విజువల్స్‌ను చూస్తుంటే, పాట కంటే ఆ విజువల్స్‌తోనే ప్రేక్షకులు మరింత మమేకమైపోతారు. ఈ సాంగ్ చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. జగన్ చాలా మంచి టీమ్‌ను ఎంపిక చేసుకున్నాడు. అతని కృషికి తప్పకుండా తగిన ఫలితం ఉంటుంది. బాలయ్య బాబుగారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే శుభాకాంక్షలు. ఈ పాటను లాంచ్ చేసే అవకాశం ఇచ్చిన అభిమానులందరికీ థ్యాంక్యూ వెరీ మచ్. బాలయ్య బాబుగారు ఎప్పుడూ ఇలాంటి అద్భుతమైన ఎనర్జీతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఏ క్యాలెండర్‌లోనూ లేని పండుగ, అభిమానుల గుండెల్లో మాత్రమే ఉండే పండుగ బాలయ్య బాబుగారి పుట్టినరోజు. ప్రతి