భారీ వర్షాల ఎఫెక్ట్.. జంట జలాశయాలకు పెరిగిన వరద నీరు
Actor ProfilePolitician

భారీ వర్షాల ఎఫెక్ట్.. జంట జలాశయాలకు పెరిగిన వరద నీరు

Total News2
Movie Updates0
Sources1
మీనాక్షి నటరాజన్ పై తప్పుడు కేసులు పెట్టించింది రేవంత్ రెడ్డే
Vaartha14 Jun 2026
మీనాక్షి నటరాజన్ పై తప్పుడు కేసులు పెట్టించింది రేవంత్ రెడ్డే

KTR: తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి రాజకీయ నైజాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి

భారీ వర్షాల ఎఫెక్ట్.. జంట జలాశయాలకు పెరిగిన వరద నీరు
Vaartha14 Jun 2026
భారీ వర్షాల ఎఫెక్ట్.. జంట జలాశయాలకు పెరిగిన వరద నీరు

Himayat Sagar: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా నగర తాగునీటి వనరులైన ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. క్యాచ్‌మెంట్ ఏరియాల నుంచి ఇన్‌ఫ్లో భారీగా వస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు మూసీ నది పరీవాహక ప్రాంతాల ప్రజలను హెచ్చరించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. Read also: Hanamkonda: హనుమకొండలో ఘోరం: పెళ్లి పేరుతో నమ్మించి.. వివాహితపై ఎస్ఐ అత్యాచారం హైదరాబాద్ జలమండలి (HMWSSB) ఉన్నతాధికారులు జంట జలాశయాల నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. రెండు రిజర్వాయర్లలోకి దాదాపు 800 క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్‌సాగర్ (గండిపేట) ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం (FTL) 1,790 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1,784.30 అడుగులకు చేరుకుంది. హిమాయత్‌సాగర్: దీని పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1,760.60 అడుగుల వద్ద నీరు కొనసాగుతోంది. ఈ వర్షాకాల సీజన్‌లో జంట జలాశయాలకు భారీ స్థాయిలో వరద నీరు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. పరిస్థితిని సమీక్షించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి.. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు హైడ్రా (HYDRAA) విభాగాలను అప్రమత్తం చేశారు. వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రస్తుతానికి జలాశయాల గేట్లు ఎత్తేంత ప్రమాదకర పరిస్థితి లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే, ఒకవేళ ఎగువ నుంచి ఇన్ ఫ్లో మరింత పెరిగి గేట్లు ఎత్తాల్సి వస్తే, ఆ సమాచారాన్ని ముందస్తుగానే ప్రజలకు చేరవేస్తామని జలమండలి అధికారులు వెల్లడించారు. Prakash Raj: బెంగళూరులో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన..హాజరుకానున్న ప్రకాశ్ రాజ్ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన

భ ర వర ష ల ఎఫ క ట జ ట జల శయ లక ప ర గ న వరద న ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in