
టెలిగ్రామ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం సడన్ షాక్ ఇచ్చింది. ఈ సోషల్ మీడియా, మెసెజింగ్ ప్లాట్ ఫామ్ ను నిషేధించింది. వీటి కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి కూడా. ఈ మేరకు కేంద్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వచ్చాయి. దేశంలో నీట్ (NEET) పరీక్షల నిర్వహణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై మనదేశంలో తాత్కాలికంగా ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 21న జరగనున్న రీ-నీట్ (Re-NEET) రాతపరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు వీలుగా ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాల సమాచారం. పరిమితుల ద్వారా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాలు, లీకేజీకి సంబంధించిన తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.జాతీయ పరీక్షల సంస్థ (NTA) చేసిన కీలక సిఫార్సుల మేరకు సమాచార సాంకేతిక చట్టం (IT Act) 2000లోని సెక్షన్ 69A కింద ఐటీ మంత్రిత్వ శాఖ ఈ కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. గతంలో జరిగిన నీట్ పరీక్షల సమయంలో ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించిన ఆరోపణలు, ప్రచారాలు టెలిగ్రామ్ గ్రూపుల వేదికగానే పెద్ద ఎత్తున సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సారి పరీక్ష నిర్వహణ తరుణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుగానే గట్టి నిఘా చర్యలు చేపట్టింది.టెలిగ్రామ్ యాక్సెస్, మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌పై నిబంధనలుఈ నూతన తాత్కాలిక ఆంక్షల ప్రకారం టెలిగ్రామ్ వేదికపై ప్రభుత్వం రెండు రకాల నిషేధాలను విధించింది. అందులో భాగంగా మొదటి నిబంధన కింద, భారత్‌లో టెలిగ్రామ్ ప్లాట్‌ఫామ్ యాక్సెస్‌ను ఒక నిర్ణీత వ్యవధి కొరకు పరిమితం చేయనున్నారు. ఈ నిషేధం 2026 జూన్ 22వ తేదీ వరకు అమల్లో ఉంటుందని ఉత్తర్వులలో స్పష్టం చేశారు.