భారత్ లో అమెజాన్ రూ. 4.53 లక్షల కోట్ల పెట్టుబడులు
Actor ProfileCelebrity

భారత్ లో అమెజాన్ రూ. 4.53 లక్షల కోట్ల పెట్టుబడులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భారత్ లో అమెజాన్ రూ. 4.53 లక్షల కోట్ల పెట్టుబడులు
Oneindia Telugu21 Jul 2026
భారత్ లో అమెజాన్ రూ. 4.53 లక్షల కోట్ల పెట్టుబడులు

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, భారత్‌లో తన వ్యాపార కార్యకలాపాలను భారీగా విస్తరిం చేందుకు సిద్ధమైంది. 2026 నుంచి 2030 మధ్య కాలంలో భారత్‌లో ఏకంగా 48 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 4.53 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు గురువారం ప్రకటించింది. అలాగే 2030 నాటికి దేశంలో ఏఐ (AI), క్లౌడ్ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి అదనంగా 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ప్రధానితో భేటీ వేళ అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ ఈ ప్రకటన చేసారు.ప్రధాని నరేంద్ర మోదీతో కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ సమావేశం వేళ కీలక ప్రకటన చేసారు. 2026 నుంచి 2030 మధ్య కాలంలో భారత్‌లో ఏకంగా 48 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 4.53 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తరించడానికి 2030 నాటికి అదనంగా 13 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఆండీ జెస్సీ తెలిపారు. దీంతో కేవలం ఏఐ, క్లౌడ్ రంగంలోనే అమెజాన్ మొత్తం పెట్టుబడి 21 బిలియన్ డాలర్లను దాటనుంది. ఈ పెట్టుబడుల ద్వారా ముంబై, హైదరాబాద్‌లలోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడ‌బ్ల్యూఎస్‌) డేటా సెంటర్ల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనున్నారు. ఇది స్టార్టప్‌లు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలకు కస్టమ్ ఏఐ చిప్స్, సురక్షిత క్లౌడ్ టెక్నాలజీలు, డెవలపర్ టూల్స్‌ను అందుబాటులోకి తెస్తుంది. తద్వారా ఆవిష్కరణలను వేగవంతం చేయవచ్చని కంపెనీ పేర్కొంది.కొత్త పెన్షన్ల మంజూరు, పంపిణీ పై కీలక నిర్ణయం - మార్గదర్శకాలు..!!రానున్న కాలంలో 3.8 మిలియన్ల ఉద్యోగాలకు మద్దతుఅదే విధంగా ఈ పెట్టుబడి పై అండీ జెస్సీ కీలక అంశాలను వెల్లడించారు.. దశాబ్దం క్రితం భారత్‌లోకి అడుగుపెట్టాం. అప్పటి నుంచి ఈ-కామర్స్, ఏఐ, క్లౌడ్ వ్యాపారాల్లో అద్భుతమైన వృద్ధిని చూస్తున్నాం. ప్రధాని మోదీ దార్శనికత అయిన వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల సాధనకు కట్టుబడి ఉన్నాం.

భ రత ల అమ జ న ర 4 53 లక షల క ట ల ప ట ట బడ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in