
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రాబోతోన్నారు. త్వరలోనే ఆయన పర్యటన ఉండబోతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారకపోవడం, శాంతి ఒప్పందాలపై జరుగుతున్న చర్చలేవీ పెద్దగా ఫలించట్లేదు. హార్మోజ్ స్ట్రెయిట్ విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం దీనికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఈ పరిణామాల మధ్య ట్రంప్ భారత్ కు రాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.భట్టి విక్రమార్క ఫొటోను షేర్ చేసిన డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది ఆరంభంలో డొనాల్డ్ ట్రంప్ భారత్ ను సందర్శించే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలను మరింత పటిష్టం చేసే దిశగా ఈ కీలక పర్యటనకు సంబంధించిన అజెండా రూపుదిద్దుకుంటోంది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అధికారికంగా వెల్లడించారు. ట్రంప్ ప్రయాణం కోసం ఇరు దేశాల దౌత్య యంత్రాంగాలు ఇప్పటికే సన్నాహాలు ముమ్మరం చేశాయని పేర్కొన్నారు.ప్రముఖ వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్కో రూబియో మాట్లాడారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అధ్యక్షుడు ట్రంప్ భారత్‌లో పర్యటించేలా తాము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. భారత్.. తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన భాగస్వామ్య దేశమని, సుదీర్ఘకాలంగా సన్నిహిత మిత్రత్వం ఉందని గుర్తు చేశారు. అంతర్జాతీయ దౌత్యరంగంలో దేశాధినేతల మధ్య సత్సంబంధాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఆ కోణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం ఎంతో బలమైనదని వ్యాఖ్యానించారు.US Tariffs: మళ్లీ సుంకాల మోత..! భారత్ కు ట్రంప్ హెచ్చరిక..!ఈ రెండు దేశాల మధ్య దౌత్య ప్రయాణం ప్రస్తుతం అద్భుతంగా సాగుతోందని విదేశాంగ మంత్రి రూబియో ప్రశంసించారు. ఇటీవల ఫ్రాన్స్ వేదికగా సాగిన జీ7 సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీతో డొనాల్డ్ ట్రంప్ జరిపిన భేటీలు ఇరు దేశాల బంధానికి అద్దం పడుతున్నాయని అన్నారు. చాలా కాలంగా ఇరు దేశాల మధ్య పెండింగ్‌లో ఉన్న ప్రతిష్టాత్మక వాణిజ్య ఒప్పంద చర్చలు ప్రస్తుతం