
భారత్ సంసృతి సంప్రదాయాలను ఇష్టపడి ఇక్కడే ఉండిపోయారు ఎందరో విదేశీయలు. వాళ్లంతా ఈ నేలపై నచ్చిన అంశాలను కళ్లకు కట్టినట్లుగా వివరించి భారతీయులనే ఫిదా చేశారు. తాజాగా మరో మహిళ భారత్ నుంచి ఆ నాలుగు పేరెంటింగ్ పాఠాలు నేర్చుకున్నానంటూ షేర్ చేసిన పోస్ట్ అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఇక్కడ పిల్లల పెంపకం విషయంలో ఆ నాలుగు విధానాలు తనకు ఎంతగానో నచ్చాయని, అమ్మ పెంపకం ఇంత గొప్పగా ఉంటుందని తెలుసుకున్నా అంటూ వాటి గురించి పూసగుచ్చినట్లు వివరించింది. మరి ఆ విదేశీ మహిళ మెచ్చిన ఆ పేరెంటింగ్ పాఠాలేంటో చూద్దామా!. భారతదేశం నుంచి పిల్లల పెంపకానికి సంబంధించి ఆ నాలుగు అలవాట్లను తనలో భాగం చేసుకున్నాననంటూ యూరోపియన్ మహిళ క్సేనియా ఇన్‌స్టాగ్రామ్ వేదిక వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో భారత్ నుంచి నేర్చుకున్న పెంపకపు అలవాట్లు తన పిల్లలను పెంచే విధానంను ఎలా మార్చాయో తెలిపింది. మొదట్లో తనకు మాతృత్వం చాలా కొత్తగా ఏదో అపరిచితంగా అనిపించింది. కానీ భారత్‌కు వచ్చాక అది ఇష్టమైన కుటుంబ బాధ్యతలుగా అనిపించాయని అంటోంది. కొత్త దేశంలో స్థానిక సంప్రదాయలకు అనుగుణంగా పిల్లలను పెంచడం కాస్తా సవాలుగా ఉంటుందని కానీ, భారతీయ సంస్కృతి మాతృత్వాన్ని మధురంగా మార్చి సులభంగా మమేకమయ్యేలా చేస్తుందని చెబుతోంది. అలాగే పిల్లల పెంపకానికి సంబంధించి తను మెచ్చిన భారత మాతృత్వ విధానాలు ఏంటంటే.. పిల్లలతో కలిసి నిద్రపోవడం.. పిల్లల చెంత పడుకోవడం తల్లి బిడ్డల మధ్య అనుబంధానికి వేదిక అని అంటోంది. బెడ్ షేర్ చేసుకోవడంలో భద్రంగా ఉన్నాననే భరోసా పిల్లల్లో కలుగుతుంది..తన బిడ్డతో పూర్తిగా గడుపుతున్నా అనే భావన తల్లిలోనూ కలుగుతుంది. ఇద్దరి మధ్య గాఢంగా పెనవేసుకునే బంధానికి ఇదే ప్రధానం అంటోంది. రోజువారీ నూనె మర్దనలు.. భారత్ నుంచి స్వీకరించిన సంప్రదాయం..రోజువారి నూనె మర్దన. దీనిని మాలిష్ అని పిలుస్తారు. శిశు సంరక్షణకు సంబంధించింది..ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదపడే అంశం కూడా