భారత్ కు ఎకనమిక్ పవర్ హౌస్ గా ఆంధ్రప్రదేశ్
Actor ProfilePolitician

భారత్ కు ఎకనమిక్ పవర్ హౌస్ గా ఆంధ్రప్రదేశ్

Total News1
Movie Updates0
Sources1
భారత్ కు ఎకనమిక్ పవర్ హౌస్ గా ఆంధ్రప్రదేశ్
TeluguOne16 Jun 2026
భారత్ కు ఎకనమిక్ పవర్ హౌస్ గా ఆంధ్రప్రదేశ్

భూమి, నీరు, మౌలిక వసతులు, అత్యుత్తమ పాలసీలతో పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూల స్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఏపీదే పేటెంట్ అని, పెట్టుబడులకు ఎంతో సురక్షితమని స్పష్టం చేశారు. ఈ ఏడాది విశాఖలో తలపెట్టిన పార్టనర్షిప్ సమ్మిట్‌కు సన్నాహకంగా సింగపూర్‌లో సీఐఐ నిర్వహించిన బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ‘సింగపూర్‌తో భారత్‌కు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు మంచి సంబంధాలున్నాయి. సింగపూర్ నిర్మాత లీ క్వాన్ యూ అంటే నాకు చాలా అభిమానం. 3 దశాబ్దాలుగా సింగపూర్‌తో కలిసి పనిచేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్‌లో సింగపూర్ టౌన్ షిప్‌నే నిర్మించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చింది. బ్లూ, గ్రీన్ రాజధానిగా ఓ అద్భుతమైన బృహత్ ప్రణాళికను సింగపూర్ రూపొందించి అందించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి తదితర అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రాంతం అని స్పష్టం చేస్తున్నా. సింగపూర్ పారిశ్రామిక వేత్తలు అమరావతిని, ఆంధ్రప్రదేశ్‌ను రెండో నివాసంగా ఎంచుకోవాలి.’ అని అన్నారు. ‘ఏపీలో పరిశ్రమలకు భూమి కేటాయింపు, అనుమతులను వేగంగా జారీ చేస్తున్నాం. ప్రపంచ దిగ్గజ స్టీల్ కంపెనీ అయిన ఆర్సెలార్ మిట్టల్‌కు అనతికాలంలోనే అన్ని అనుమతులు వేగంగా ఇచ్చాం. 2028 నాటికి ఆర్సెలార్ మిట్టల్ ఉత్పత్తి కూడా ప్రారంభించి ఏపీ నుంచి ఎగుమతులు చేస్తుంది. గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా హబ్ కూడా ఏర్పాటు అవుతోంది. ఆ సంస్థకు గ్రీన్ ఎనర్జీని సరఫరా చేయాలని నిర్ణయించాం. పెట్టుబడులు వచ్చిన మరుక్షణం నుంచే పరిశ్రమలు ప్రారంభించేలా ఓ నిర్దిష్టమైన కాలవ్యవధిని నిర్ణయిస్తున్నాం. గూగుల్‌తో పాటు దాదాపు 10 గిగావాట్ల సామర్ధ్యం ఉన్న డేటా సెంటర్లను వివిధ కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నాయి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్

భ రత క ఎకనమ క పవర హ స గ ఆ ధ రప రద శ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in