భారత్ కు ఇరాన్ చమురు..? ట్రంప్ ఆంక్షల సడలింపుతో
Actor ProfilePolitician

భారత్ కు ఇరాన్ చమురు..? ట్రంప్ ఆంక్షల సడలింపుతో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భారత్ కు ఇరాన్ చమురు..? ట్రంప్ ఆంక్షల సడలింపుతో
Oneindia Telugu9 Jul 2026
భారత్ కు ఇరాన్ చమురు..? ట్రంప్ ఆంక్షల సడలింపుతో

అమెరికా ప్రభుత్వం ఇరాన్ ముడి చమురు ఎగుమతులపై 60 రోజుల పాటు తాత్కాలికంగా ఆంక్షల మినహాయింపు ప్రకటించడంతో టెహ్రాన్ అలర్ట్ అయింది. లభించిన ఈ స్వల్ప వ్యవధిలోనే భారత్‌ సహా ఆసియాలోని ప్రధాన చమురు కొనుగోలు దేశాలకు పెద్ద ఎత్తున చమురును విక్రయించేందుకు ఇరాన్ ముమ్మర ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. తద్వారా గత కొన్నేళ్లుగా కేవలం చైనాపైనే ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది.సముద్రంలో నిలిచిపోయిన మిలియన్ల కొద్దీ బారెళ్ల ముడి చమురును వీలైనంత త్వరగా వదిలించుకోవాలని ఇరాన్ భావిస్తోంది. తాజా అంచనాల ప్రకారం.. దాదాపు 6.8 కోట్ల బారెళ్ల ముడి చమురు ప్రస్తుతం సముద్రంలో నౌకల్లోనే నిల్వ ఉంది. ఇందులో దాదాపు 80 శాతానికి పైగా వాల్యూమ్‌కు కొనుగోలుదారులు ఇంకా ఖరారు కాలేదు. దీంతో భారతీయ రిఫైనరీలతో పాటు జపాన్, దక్షిణ కొరియా సంస్థలతో చర్చలు జరుపుతున్నారు.భారత చమురు సంస్థలు మొగ్గు చూపుతాయా?భౌగోళికంగా ఇరాన్‌ మన దేశానికి అత్యంత సమీపంలో ఉండటం వల్ల కేవలం రెండు మూడు రోజుల్లోనే చమురు రవాణా పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ పరిణామం భారత కంపెనీలకు సానుకూలమైనప్పటికీ, ఆచరణలో అనేక సవాళ్లు ఉన్నాయి. సాధారణంగా మన దేశీ చమురు శుద్ధి సంస్థలు అమెరికా ఆంక్షల ముప్పు పొంచి ఉన్న చమురును కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించవు.మరొక ప్రధాన అడ్డంకి ఏమిటంటే.. ఈ మినహాయింపు వ్యవధి కేవలం 60 రోజులు మాత్రమే ఉండటం. రిఫైనరీల కొనుగోలు ప్రణాళికలు ఎప్పుడూ 2 నుండి 3 నెలల ముందే ఖరారవుతాయి. ఇప్పటికే భారతీయ సంస్థలు ఆగస్టు సగం వరకు అవసరమైన ముడి చమురును రష్యా, ఇతర మధ్య ప్రాచ్య దేశాల నుంచి బుక్ చేసుకున్నాయి. అలాగే అమెరికా తదుపరి విధానాలు ఎలా ఉంటాయో తెలియకపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది.యూరోపియన్ యూనియన్, బ్రిటన్ విధించిన ఇతర ఆంక్షల కారణంగా రవాణా ఇన్సూరెన్స్, చెల్లింపుల ప్రక్రియకు సంబంధించిన ఇబ్బందులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చమురు