భారత్ కి అమెరికా డైరెక్ట్ వార్నింగ్! జైశంకర్ -రూబియో ఫోన్ సంభాషణ
Actor ProfilePolitician

భారత్ కి అమెరికా డైరెక్ట్ వార్నింగ్! జైశంకర్ -రూబియో ఫోన్ సంభాషణ

Total News1
Movie Updates0
Sources1
భారత్ కి అమెరికా డైరెక్ట్ వార్నింగ్! జైశంకర్ -రూబియో ఫోన్ సంభాషణపై శశథరూర్ ఆగ్రహం
Samayam Telugu14 Jun 2026
భారత్ కి అమెరికా డైరెక్ట్ వార్నింగ్! జైశంకర్ -రూబియో ఫోన్ సంభాషణపై శశథరూర్ ఆగ్రహం

ఒమాన్ ప్రాంతంలో హార్మూజ్ జలసంధిలో భారతీయులున్న నౌకలను అమెరికా టార్గెట్ చేసిన విషయం తెలిసింది. వరుసగా మూడు నౌకలపై దాడి చేయగా.. అందులో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో‌‌ భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్‌‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆ సంభాషణలో అమెరికా కనీసం సంఘీభావం తెలపకపోగా.. భారత్‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉంది. అమెరికా తీరుపై విదేశాంగ సహాయ మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఫోన్ సంభాషణకు సంబంధించిన నోట్‌ను అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ అధికారికంగా వెల్లడించారు. హార్మూజ్ జలసంధి ప్రాంతంలో చోటుచేసుకున్న పరిణామాలపై రూబియో మాట్లాడుతూ.. హార్మూజ్ జలసంధిలో శాంతి, భద్రతను కాపాడేందుకు అమెరికా దళాలు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. అన్ని వాణిజ్య నౌకలు వెంటనే అమెరికా బలగాల ఆదేశాలు పాటించాలని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా అమెరికా విధించిన దిగ్బంధాన్ని ఉల్లంఘించడం లేదా అక్రమంగా ఇరాన్ చమురును రవాణా చేయడాన్ని ఏమాత్రం సహించబోమంటూ రూబిన్ హెచ్చరించారు. అమెరికా అధికారిక ప్రకటనపై శశిథరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్ట్ చేశారు. "అమాయక భారతీయుల ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకుండా అమెరికా ప్రకటన విడుదల చేయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. స్నేహపూర్వక దేశం, వ్యూహాత్మక భాగస్వామి ఎలా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? హార్మూజ్ జలసంధి మార్గంలో ప్రయాణించే దాదాపు ప్రతి వాణిజ్య నౌకలో భారతీయ సిబ్బంది ఉంటారు. అంటే వారందర్నీ అమెరికా తమ క్షిపణులకు లక్ష్యాలుగా చేస్తుందా? ఈ విధానం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో దృష్టికి తీసుకెళ్లారని నేను అనుకుంటున్నాను" అని పోస్ట్