భారత్ కఠిన నిర్ణయం.. గజగజ వణికిపోతున్న పాకిస్థాన్
Actor ProfilePolitician

భారత్ కఠిన నిర్ణయం.. గజగజ వణికిపోతున్న పాకిస్థాన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భారత్ కఠిన నిర్ణయం.. గజగజ వణికిపోతున్న పాకిస్థాన్
Oneindia Telugu21 Aug 2026
భారత్ కఠిన నిర్ణయం.. గజగజ వణికిపోతున్న పాకిస్థాన్

సింధూ జలాల ఒప్పందం విషయంలో భారతదేశం అవలంబిస్తున్న కఠిన వైఖరి పాకిస్తాన్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ జలాల వివాదం కారణంగా పాక్ కేవలం వ్యవసాయ రంగంలోనే కాకుండా, అక్కడి పర్యాటక రంగంలోనూ భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుందనే తీవ్ర భయాలు కలవరపెడుతున్నాయి. భారత్ నుంచి సరిహద్దు దాటి పాకిస్తాన్ మీదుగా ప్రవహించే నదులు, వాటి అనుబంధ సరస్సులు, వాటర్ పార్కులపై ఆధారపడి జీవిస్తున్న స్థానిక ప్రజలు, పర్యాటక రంగ వ్యాపారస్తులు తమ భవిష్యత్తుపై ఇప్పుడు తీవ్ర కలవరం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో ఈ జల నియంత్రణ ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం ఉందని అక్కడి ఆర్థిక, సామాజిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఉత్తర పర్వత ప్రాంతాలలో ప్రవహించే వేగవంతమైన నదులు, సహజసిద్ధమైన మంచినీటి సరస్సులు వేలాది శ్రామిక కుటుంబాలకు ఏకైక ఆజీవనాధారంగా నిలుస్తున్నాయి. పాకిస్తాన్‌ వ్యాప్తంగా ప్రకృతి ప్రేమికులను, పర్యాటకులను విశేషంగా ఆకర్షించే పర్యాటక కేంద్రాలు ఇక్కడే ఉండటంతో, నీటి కొరత ఈ రంగాన్ని నిలువునా దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉంది.పాకిస్తాన్ వాటర్ టూరిజంపై పొంచి ఉన్న ముప్పుఖైబర్ పఖ్తుంఖ్వా పరిధిలోని నారన్-కాగన్ లోయలో ఉన్న ప్రసిద్ధ సైఫుల్ ములుక్ సరస్సు, ఆన్సూ సరస్సులతో పాటు హరిపూర్‌లోని ఖాన్‌పూర్ డ్యామ్ వంటి జలాశయాలు పాక్ అంతర్గత పర్యాటక రంగానికి కీలక కేంద్రాలుగా ఉన్నాయి. అయితే సింధు నదీ జలాల నియంత్రణ వల్ల నదుల్లో సహజమైన నీటి ప్రవాహం తగ్గిపోతే, ఈ పర్యాటక ప్రాంతాలు తమ ప్రాభవాన్ని కోల్పోతాయి. దీనివల్ల స్థానిక హోటళ్లు, రవాణా రంగం, సాహస జల క్రీడల నిర్వాహకులు బతుకుదెరువు కోల్పోతారు. ఇది పరోక్షంగా లక్షలాది మందిని నిరుద్యోగంలోకి నెట్టి, దేశంలో తీవ్ర సామాజిక సంక్షేమానికి దారితీస్తుందని స్థానిక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.2028 లక్ష్యంగా భారత్ వ్యూహాత్మక అడుగులుపాకిస్తాన్‌కు ప్రవహించే సింధూ నది ఉపనదుల జలాలపై భారత్ తన పట్టును మరింత బిగిస్తోంది

భ రత కఠ న న ర ణయ గజగజ వణ క ప త న న ప క స థ న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in