
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెస్తున్న సాంకేతిక మార్పులతో అంతర్జాతీయంగా ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. అయినా ఇండియా వివిధ అంతర్జాతీయ సూచీల్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. భారత్ రక్షణ రంగంపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ ప్రపంచంలోనే 5వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల్లో భారత్‌కు అది అనివార్యమే. అయితే ఇండియన్ ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల (ఈఎమ్ఎస్) రంగం అద్భుతమైన వృద్ధిని సాధిస్తుండటం విశేషం. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్‌ఐ పథకాలు, స్మార్ట్ పరికరాలకు పెరుగుతున్న డిమాండ్ దీనికి ప్రధాన కారణాలు. దేశీయ ఈఎంఎస్ మార్కెట్ రాబోయే సంవత్సరాల్లో భారీగా విస్తరించి ప్రపంచ తయారీ కేంద్రంగా అవతరించే దిశగా దూసుకుపోతోంది. భారతదేశ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ రాబోయే ఐదేళ్లలో దాదాపు 3 రెట్లు పెరిగి, సుమారు రూ. 14.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. 'మేక్ ఇన్ ఇండియా', ఈసీఎంఎస్ , సెమీకండక్టర్ ప్రోత్సాహకాల ద్వారా కోట్లాది రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. కొత్తగా ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ ప్లాంట్లు కూడా ఏర్పాటవుతున్నాయి. మొబైల్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సాధారణ అసెంబ్లీ స్థాయి నుండి.. పీసీబీలు , కెమెరా మాడ్యూల్స్, చిప్ తయారీ వరకు పరిశ్రమ విస్తరిస్తోంది. ఈ రంగం దేశంలో లక్షల కొద్దీ ఉద్యోగాలను సృష్టిస్తోంది. భవిష్యత్తులో కేవలం అసెంబ్లింగ్ కాకుండా సొంత డిజైన్లు, మేధో సంపత్తి (IP)ని అభివృద్ధి చేయడంపై భారత్ దృష్టి పెడుతోంది. భారత్ ఈఎంఎస్ 2030 నాటికి 150 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉందని కేపీఎంజీ నివేదికలు విశ్లేషిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ తయారీ రంగంలో భారత్ ఇప్పటికే ఇంగ్లాండ్‌ను అధిగమించి టాప్ 5లోకి ప్రవేశించింది. వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం భారత తయారీ ఉత్పత్తి విలువ 781 బిలియన్ డాలర్లకు చేరి, దక్షిణ కొరియా, యుకే, ఫ్రాన్స్‌లను వెనక్కి నెట్టింది. భారతం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం గత మూడు దశాబ్దాలుగా అసెంబ్లిగ్‌కే పరిమితమై ఎక్కువగా