
హైకోర్టును.. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం సీఆర్‌డీఏ అధికారులు మమ్మల్ని అనేక రకాలుగా వేధిస్తున్నారు మా బాధలు ఎవరు వింటారో వారిని కలుస్తాం.. తప్పేమిటి? మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసి మా గోడు విన్నవించుకున్నాం.. మా కష్టాల గురించి తెలుసుకునేందుకే కమిటీ ఏర్పాటు చేశారు.. ఆ కమిటీ నాయకులు వస్తుంటే దాడి చేయడం దుర్మార్గం.. ఉండవల్లి, పెనుమాక భూ సేకరణ జాబితాలో లేవన్నారు.. భూములు ఇవ్వడం ఇష్టం లేని వారిని 9.2 పత్రాలిమ్మన్నారు.. భూములివ్వడం లేదని రకరకాలుగా ఇబ్బందిపెడుతున్నారు.. తాడేపల్లి రూరల్: భూమిని కాపాడుకోవడం కోసం కలసికట్టుగా న్యాయపోరాటం చేస్తామని ఉండవల్లి, పెనమాక రైతులు స్పష్టంచేశారు. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళతామన్నారు. న్యాయపోరాటంతోపాటు కలసివచ్చే రాజకీయ పార్టీలతో కలసి పోరాటం చేస్తామని రైతులు తెలిపారు. మంగళవారం గుంటూరు జిల్లా ఉండవల్లి సెంటర్‌లోని ఓ రైస్‌మిల్లులో రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులు, భూసేకరణకు నోటీసులు వచ్చిన రైతులు సమావేశం నిర్వహించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. దేశ రక్షణకు సైనికులు ఎంత అవసరమో దేశంలో ప్రజల ఆకలి తీర్చడానికి రైతులు కూడా అంతే అవసరమని వారు పేర్కొన్నారు. బాధల్లో ఉన్నప్పుడు తమను ఓదార్చే వారిని తప్పనిసరిగా కులాలు, మతాలతో సంబంధం లేకుండా కలుస్తామని, దానిలో భాగంగానే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశామని రైతులు వివరించారు. సీఆర్‌డీఏ పరిధిలో రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని తమ కష్టాలను వివరించామని, దానికి స్పందించిన ఆయన న్యాయ సలహా కమిటీ, సీఆర్‌డీఏ రైతుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారని, ఆ కమిటీ క్షేత్రస్థాయిలో రైతుల బాధలను తెలుసుకోవడానికి వస్తున్న సమయంలో ఉండవల్లి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో దాడులు జరగడం చాలా దురదృష్టకరమని ఉండవల్లి రైతులు పేర్కొన్నారు. సీఆర్‌డీఏ అధికారులు, టీడీపీ పెద్దలు రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వాలని కోరినప్పుడు 95 శాతం మంది భూములు ఇచ్చారని తెలిపారు. మిగిలిన భూమిని వదిలివేస్తామని వారు హామీ