
Chitrajyothy•18 Aug 2026
భుజాల కండరాలు చిట్లాయి.. పవన్ క ల్యాణ్ కు వెంట నే శస్త్ర చికిత్స చేయాలిఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు తక్షణమే శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు తక్షణమే శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు సూచించారు. ఆయన కొంతకాలంగా రొటేటర్ కఫ్, రెండు భుజాల కండరాల గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. భుజాల కండరాలు చిట్లడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. దీంతో ఆయన సోమవారం ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి సతీమణి అన్నా కొణిదెలతో కలసి వెళ్లారు. రెండు భుజాలను నిశితంగా పరీక్షించిన వైద్యులు రొటేటర్ కఫ్‌తో పాటు భుజాల కండరాలు తీవ్రంగా గాయపడినట్లు నిర్ధారించారు. తక్షణం శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. అయితే ముందుగా నిర్ణయించిన పాలనాపరమైన, అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత శస్త్ర చికిత్స చేయించుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారు