
ఆదివారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతిచెందారు. మృతుల్లో మూడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఈ ప్రమాదాలు జరిగాయి. ఒక్కసారిగా అదుపుతప్పి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాధారం–పూసుగూడెం మధ్య అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలతోపాటు ఓ చిన్నారి మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగం వల్ల కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతులను భద్రాచలానికి చెందిన దూడల సాయిప్రకాశ్ (28), సంధ్య (25) దంపతులకు మోక్షిత్ (3)గా గుర్తించారు. సాయిప్రకాశ్ తండ్రి శ్రీనివాసరావు ఆరు నెలల క్రితం మృతిచెందగా ములకలపల్లికి చెందిన ఆయన తమ్ముడు కాశీరామేశ్వరం కొన్ని నెలలుగా హైదరాబాద్‌లో ఉండటం వల్ల సంప్రదాయం ప్రకారం అన్న కుటుంబాన్ని నిద్రకు పిలవడం కుదరలేదు. ఇటీవలే హైదరాబాద్ నుంచి ములకలపల్లి చేరుకున్న ఆయన.. సాయిప్రకాశ్ కుటుంబాన్ని భోజనానికి ఆహ్వానించారు. దీంతో సాయిప్రకాశ్ తన పెద్ద కుమారుడిని అమ్మమ్మ ఇంట్లో దిగబెట్టి భార్య, చిన్నకుమారుడితోపాటు తల్లి జ్యోతితో కలిసి ఆదివారం ములకలపల్లికి వచ్చారు. మధ్యాహ్న భోజనం అనంతరం తిరిగి బయలుదేరిన 10 నిమిషాలకే మాధారం అటవీ ప్రాంతంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో సాయిప్రకాశ్ డ్రైవింగ్ సీట్లోనే ప్రాణాలు వదలగా ఆయన భార్య, చిన్నకుమారుడు రోడ్డుపై ఎగిరిపడి మృతిచెందారు. ఆయన తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను 108 వాహనంలో పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు, తమ్ముడు మరణించడంతో రిత్విక్ ఒంటరి వాడయ్యాడు. కాగా, కారు నడుతుపున్న సాయికుమార్ చేతిలో పలీ్టపట్టి ఉండటంతో అది తినే క్రమంలో స్టీరింగ్‌పై చెయ్యి వదిలేయడంతో కారు అదుపు తప్పిందా లేక ఏదైనా వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. అయితే అజాగ్రత్తగా, అతివేగంగా నడపడంతోనే ప్రమాదం చోటుచేసుకుందని ఎస్సై మధుప్రసాద్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి