భాగ్య శ్రీ.. సైలెంట్ గా సౌత్ ను దున్నేస్తుందిగా
Actor ProfileActor

భాగ్య శ్రీ.. సైలెంట్ గా సౌత్ ను దున్నేస్తుందిగా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భాగ్య శ్రీ.. సైలెంట్ గా సౌత్ ను దున్నేస్తుందిగా
Chitrajyothy24 Jul 2026
భాగ్య శ్రీ.. సైలెంట్ గా సౌత్ ను దున్నేస్తుందిగా

సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత అవసరమో, అదృష్టం కూడా అంతే ముఖ్యం. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత అవసరమో, అదృష్టం కూడా అంతే ముఖ్యం. కొంతమంది హీరోయిన్లు ఏళ్ల తరబడి కష్టపడి ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు, ఇంకొంతమందికి మాత్రం మొదటి సినిమాకే దక్కుతుంది. ఇండస్ట్రీలో ఇలాంటి మ్యాజిక్ సృష్టించిన తారల గురించి మాట్లాడుకుంటే.. సాయి పల్లవి, శ్రీలీల పేర్లు మనకు ముందుగా గుర్తొస్తాయి. ఆ జాబితాలోకి ఇప్పుడు మరో బ్యూటీ చేరిపోయింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను క్రియేట్ చేసుకుంటూ దూసుకెళ్తున్న ఆ ముద్దుగుమ్మే.. భాగ్యశ్రీ భోర్సే (Bhagyashri Borse). రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ బ్యూటీ. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, యూత్ మొత్తం ఈమె మాయలో పడిపోయారన్నది జగమెరిగిన సత్యమే. తన స్క్రీన్ ప్రెజెన్స్, అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్, గ్లామర్‌తో ప్రతి విషయంలోనూ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఫస్ట్ సినిమాతోనే ఇంతటి అటెన్షన్ గ్రాబ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కమర్షియల్ సక్సెస్ రాకపోయినా, ఈ బ్యూటీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు సరికదా, అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ భామ, ప్రస్తుతం అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ లెనిన్ (Lenin) చిత్రంలో నటిస్తోంది. జులై 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అఖిల్‌తో పాటు భాగ్యశ్రీకి కూడా ఈ సినిమా హిట్ అవ్వడం చాలా కీలకం. ఈ చిత్రంతో గనక బ్లాక్‌బస్టర్ అందుకుంటే, తెలుగు ఇండస్ట్రీలో ఈమె స్థానం మరింత పదిలంగా మారుతుంది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, యాక్టింగ్ స్కిల్స్‌, డాన్సింగ్‌తో ఈ సినిమాలో ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా, సౌత్ ఇండియా మొత్తం తన సత్తా చాటేందుకు పక్కా ప్లానింగ్‌తో అడుగులు వేస్తోంది భాగ్యశ్రీ

భ గ య శ ర స ల ట గ స త న ద న న స త ద గ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in