భర్త రాజ్ సినిమా కంటే నాగచైతన్య సినిమానే ముఖ్యం అని తేల్చేసిన సమంత
Actor ProfileActor

భర్త రాజ్ సినిమా కంటే నాగచైతన్య సినిమానే ముఖ్యం అని తేల్చేసిన సమంత

Total News1
Movie Updates0
Sources1
భర్త రాజ్ సినిమా కంటే నాగచైతన్య సినిమానే ముఖ్యం అని తేల్చేసిన సమంత
Zee Telugu15 Jun 2026
భర్త రాజ్ సినిమా కంటే నాగచైతన్య సినిమానే ముఖ్యం అని తేల్చేసిన సమంత

Samantha:సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న మా ఇంటి బంగారం సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, సమంతకు చెందిన నిర్మాణ సంస్థ తరఫున ఆమె భర్త రాజ్ నిడుమోరు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండటంతో సమంత వరుస ప్రమోషన్లలో పాల్గొంటోంది. మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంతకు రాపిడ్ ఫైర్ రౌండ్‌లో ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ముందుగా ఏ మాయ చేసావే లేదా ఈగ సినిమాల్లో ఏది ఇష్టమని అడగగా, ఆమె వెంటనే ఏ మాయ చేసావే అని సమాధానం ఇచ్చింది. ఆ సినిమా లేకపోతే తన కెరీర్‌లో ఈగ వంటి అవకాశాలు వచ్చేవి కావని చెప్పింది. ఆ తర్వాత ఓ బేబీ లేదా అ ఆ చిత్రాల్లో ఏది ఇష్టమని అడగగా, సమంత ఓ బేబీని ఎంచుకుంది. అలాగే యశోద లేదా రంగస్థలం చిత్రాల్లో ఒకటి ఎంచుకోవాలని అడగగా, ఆమె రంగస్థలంను ఎంపిక చేసింది. A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus) ఇక చివర్లో సిటాడెల్ లేదా ది ఫ్యామిలీ మాన్ అని అడగగా, సమంత ది ఫ్యామిలీ మాన్ అని చెప్పింది. అయితే మరింత ఆసక్తికరమైన ప్రశ్నగా ది ఫ్యామిలీ మాన్ లేదా ఏ మాయ చేసావే అని అడిగినప్పుడు, ఆమె మళ్లీ ఏ మాయ చేసావేనే ఎంచుకుంది. దీనికి కారణం చెబుతూ, “ఏ మాయ చేసావే సినిమా లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఆ సినిమా నా జీవితాన్ని పూర్తిగా మార్చింది” అని సమంత పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అయితే ది ఫ్యామిలీ మాన్ సిరీస్‌కు ఆమె భర్త రాజ్ నిడుమోరు దర్శకత్వం వహించడం, మరోవైపు ఏ మాయ