బీహార్ లోని పాట్నాలో శ్రీవారి ఆలయానికి 15 ఎకరాల భూమి కేటాయింపు
Actor ProfilePolitician

బీహార్ లోని పాట్నాలో శ్రీవారి ఆలయానికి 15 ఎకరాల భూమి కేటాయింపు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బీహార్ లోని పాట్నాలో శ్రీవారి ఆలయానికి 15 ఎకరాల భూమి కేటాయింపు
Zee Telugu17 Jun 2026
బీహార్ లోని పాట్నాలో శ్రీవారి ఆలయానికి 15 ఎకరాల భూమి కేటాయింపు

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Bihar Government Allots 15 Acres Of Land For TTD: బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో టీటీడీ ఆలయం నిర్మించేందుకు బీహార్ ప్రభుత్వం అంగీకరించింది. శ్రీవారి ఆలయ నిర్మాణానికి 15 ఎకరాల భూమిని కేటాయించింది. పాట్నా సమీపంలో గంగా తీరాన శ్రీవారి దివ్యాలయం నిర్మాణం కానుంది. ఈ సందర్భంగా టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త దొరస్వామితో కలిసి బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారికి శ్రీవారి జ్ఞాపికను అందజేసి, శాలువాతో సత్కరించారు. తాజా పరిణామంతో ఉత్తర భారతదేశంలో సనాతన ధర్మ ప్రచారానికి టీటీడీ మరో ముందడుగు వేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలన్న సీఎం చంద్రబాబు సూచనలతో టీటీడీ ధర్మకర్తల మండలితోపాటు ఈవో, అదనపు ఈవోలు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే అస్సాం రాష్ట్రంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి పది ఎకరాల భూమిని కేటాయించిన విషయం తెలిసిందే. అమెరిగోగ్‌లోని సదరు భూమి టీటీడీ పేరున గత వారం క్రితం రిజిస్ట్రేషన్ అయింది. పాట్నాకు సమీపంలో గంగా నది తీరానికి దగ్గరగా, జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇక్కడ స్వామివారి ప్రధాన ఆలయంతో పాటు అత్యంత వైభవంగా కల్యాణ మండపం, పవిత్రమైన పుష్కరిణిని ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ ఆలయం నిర్మితమైతే, అది హిందూ ధర్మ పరిరక్షణకు, సనాతన సంస్కృతి విస్తరణకు ఒక ప్రముఖ కేంద్రంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భక్తుల సౌకర్యార్థం ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు