
బాలీవుడ్ నటుడు, శివసేన లీడర్ గోవిందా ఇంట్లో గన్ మిస్‌ఫైర్ అయ్యింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో గోవిందాకు తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ తెల్లవారుజామున 4.45 గంటల ప్రాంతంలో ఆయన రివాల్వర్ మిస్ ఫైర్ కావడంతో గాయమైంది. ఘటన జరిగిన సమయంలో జుహు ఇంట్లో గోవిందా ఒంటరిగానే ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. గోవిందాను ఇంటికి సమీపంలోని క్రిటికేర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స అనంతరం తిరిగి ఇంటికి వచ్చేశారని పోలీసులు వెల్లడించారు. గోవిందా కోల్‌కతాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆయన మేనేజర్ శశి సిన్హా చెప్పారు. ఆయన తన లైసెన్స్‌డ్ రివాల్వర్ కింద పడిపోవడంతో దాన్ని అల్మారాలో ఉంచే క్రమంలో అది పేలి బుల్లెట్ గోవిందా కాలికి తగిలిందని వివరించారు. దేవుడి దయ వల్లనే గోవిందా కాలికి గాయమైందని, పెద్దగా ఏమీ కాలేదని చెప్పారు. ప్రస్తుతం గోవిందా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే కొలికపూడిని సస్పెండ్ చేయాలంటూ రోడ్డెక్కిన మహిళలు గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Madhu Yashki : అమెరికాలో కారు ప్రమాదంలో గాయపడ్డ మధు యాష్కీ కుటుంబం Shreyas Iyer : సూర్యకు షాక్?.. టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్? Peddi Movie Review : బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పెద్ది.. ట్విట్టర్ టాక్ వైరల్ Donald Trump : ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. మొజ్తబాతో భేటీకి సిద్ధం Russia Afghanistan : రష్యా-తాలిబాన్ ఒప్పందం.. పాకిస్థాన్‌కు కొత్త షాక్? Iran attack : కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. విమానాలు నిలిపివేత