
ఇంటర్నెట్ డెస్క్: 12 సంవత్సరాల క్రితం దేశంలో తరచూ బాంబు పేలుళ్లు జరిగితే అప్పటి ప్రభుత్వం గానీ, ప్రధాని గానీ మౌనంగా ఉండేవారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) విమర్శించారు. కానీ ప్రధాని మోదీ పాలనా కాలంలో ఉరి, పుల్వామా, పహల్గాం దాడులకు భారత్ గట్టిగా జవాబిచ్చిందని చెప్పారు. వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో శత్రువులపై విరుచుకుపడ్డట్లు తెలిపారు. ఒకప్పుడు బుల్లెట్లు తయారు కాని చోట.. ఇప్పుడు మిసైల్స్ కూడా ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపుర్ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా మాట్లాడుతూ.. మోదీ హయాంలో కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని భద్రతా దళాలు నియంత్రించాయన్నారు. ఈశాన్య ప్రాంతం ప్రశాంతంగా ఉందని, నక్సలిజం అనేది చరిత్రగా మిగిలిపోయిందన్నారు. రైతుల గురించి కాంగ్రెస్ ఎన్నడూ పట్టించుకోలేదని విమర్శించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
