
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. AP Deputy cm Pawan Kalyan to meet the young boy Niranjan tomorrow: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణ మీ అయ్య జాగీరా అన్న వ్యాఖ్యలపై రచ్చ ఇంకా కొనసాగుతుంది. దీనిపై తెలంగాణలోని అధికార కాంగ్రెస్ తో పాటు పలు పార్టీలు కౌంటర్ లు సైతం ఇచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో కూడా తెలంగాణకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, కానీ విభజన జరిగిన తీరుకు మాత్రమే తాము వ్యతిరేకమన్నారు. ఇన్ని ఏళ్లు గడుస్తున్న కూడా కొంత మంది నేతలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు పెరిగేలా మాట్లాడుతున్నారని అన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభకు అనుమతి ఇవ్వక పోవడంపై కూడా తీవ్ర అసహానంవ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటించవచ్చని, ఎన్నికల్లో పోటీకి దిగొచ్చని అన్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై మంటలు ఇంకా చల్లారలేదు. ఈ నేపథ్యంలో మరోసారి పవన్ కళ్యాణ్ తెలంగాణకు రానుండటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. హనుమ కొండలో చిన్నారి నిరంజన్ అనే బాలుడు ప్రాణాంతకమైన వ్యాధితో పొరాడుతున్నాడు. ఒకసారి తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తో మాట్లాడాలని ఉందని చెప్పారు. ఇది కాస్త బాలుడి తల్లిదండ్రులు జనసేన నేతలకు చెప్పారు. వారు పవన్ కళ్యాణ్ కు చెప్పడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. బాలుడి కోరికను తీర్చేందుకు రేపు (బుధవారం)