బాలయ్య కల సాకారం.. రాజధానిలో కొరటాల శివతో కొత్త చిత్రం ప్రారంభం
Actor ProfileCelebrity

బాలయ్య కల సాకారం.. రాజధానిలో కొరటాల శివతో కొత్త చిత్రం ప్రారంభం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాలయ్య కల సాకారం.. రాజధానిలో కొరటాల శివతో కొత్త చిత్రం ప్రారంభం
AP7AM19 Jul 2026
బాలయ్య కల సాకారం.. రాజధానిలో కొరటాల శివతో కొత్త చిత్రం ప్రారంభం

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రాబోతున్నట్లు ప్రకటన వచ్చిన నాటి నుంచే ఇండస్ట్రీలో అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు మరింత ఊపునిస్తూ, ఈ క్రేజీ ప్రాజెక్ట్ (వర్కింగ్ టైటిల్ 'NBK 112') ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైంది. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుక జ‌రిగింది.ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాను సుమారు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.అమరావతిలో ఈ సినిమాను ప్రారంభించడం వెనుక ఓ ప్రత్యేక కారణం ఉందని నిర్మాత సుధాకర్ చెరుకూరి వివరించారు. "రాజధాని అమరావతిలో ఒక భారీ సినిమా ప్రారంభోత్సవం చేయాలనేది బాలకృష్ణ గారి చిరకాల స్వప్నం. అది మా సినిమాతో నెరవేరడం చాలా గర్వంగా ఉంది. ప్రకాశం జిల్లా వాడినైన నేను, మన రాజధాని నడిబొడ్డున ఈ సినిమాను లాంచ్ చేయడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి. గత మూడు నాలుగేళ్లుగా బాలయ్య గారితో సినిమా చేయాలన్న నా కోరిక ఇప్పటికి నెరవేరింది" అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.ఈ ప్రాజెక్ట్ కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక కళాకారులకు

బ లయ య కల స క ర ర జధ న ల క రట ల శ వత క త త చ త ర ప ర ర భ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in