బేబీ బంప్ ఫోటోతో సిక్స్ ప్యాక్ కి గుడ్ బై చెప్పిన సమంత.. మళ్లీ రెండేళ్లు బ్రేక్
Actor ProfilePolitician

బేబీ బంప్ ఫోటోతో సిక్స్ ప్యాక్ కి గుడ్ బై చెప్పిన సమంత.. మళ్లీ రెండేళ్లు బ్రేక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బేబీ బంప్ ఫోటోతో సిక్స్ ప్యాక్ కి గుడ్ బై చెప్పిన సమంత.. మళ్లీ రెండేళ్లు బ్రేక్
Asianet News Telugu25 Aug 2026
బేబీ బంప్ ఫోటోతో సిక్స్ ప్యాక్ కి గుడ్ బై చెప్పిన సమంత.. మళ్లీ రెండేళ్లు బ్రేక్

నటి సమంత తన భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తోంది. తన కొత్త సినిమా సక్సెస్ మీట్‌లో ఈ శుభవార్తను ఆమె పంచుకుంది. త్వరలో మెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నట్లు కూడా చెప్పింది. ఈ సందర్భంగా తన బేబీ బంప్ ఫోటోను పంచుకుంది. సమంత తల్లి కాబోతున్న శుభవార్తను పంచుకుంది. సోమవారం, సమంత తన బేబీ బంప్ ఫోటోను అభిమానులతో పంచుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ ఫోటోకి 'నా సిక్స్ ప్యాక్... మళ్లీ కలుద్దాం' అని సరదాగా క్యాప్షన్ పెట్టింది. ఇందులో బీబే బంప్‌తో సమంత ఉంది. సిక్స్ ప్యాక్‌ చేసే దిండు కూడా ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తన సినిమా 'మా ఇంటి బంగారం' సక్సెస్ మీట్‌లో సమంత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ధృవీకరించిన విషయం తెలిసిందే. నటనకు కొంతకాలం విరామం ఇచ్చి మెటర్నిటీ లీవ్‌పై వెళ్తున్నట్లు ఆమె ప్రకటించింది. 'క్షమించండి, మరో చిన్న బ్రేక్ తీసుకుంటున్నాను, మళ్లీ తిరిగి వస్తాను. ఇప్పుడు నేను మెటర్నిటీ లీవ్ తీసుకోవాలి. కానీ నేను చాలా సంతోషంగా ఉన్నాను' అని మీడియాకు చెప్పింది. ఈ లెక్కన మరో రెండేళ్లు బ్రేక్‌ తీసుకోబోతుంది సమంత. సమంత, రాజ్ నిడిమోరు 2025లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో వివాహం. సమంత గతంలో 2017 నుంచి 2021 వరకు నటుడు నాగ చైతన్యను పెళ్లి చేసుకుని విడిపోయింది. అలాగే, రాజ్ నిడిమోరుకు కూడా గతంలో శ్యామలీ దేతో వివాహమైంది