బాపట్ల విద్యా
Actor ProfilePolitician

బాపట్ల విద్యా

Total News1
Movie Updates0
Sources1
బాపట్ల విద్యా, వైద్య వికాస మార్గదర్శి, సేవా దార్శనికుడు డాక్టర్ యార్లగడ్డ శ్రీ కృష్ణమూర్తి
TeluguOne14 Jun 2026
బాపట్ల విద్యా, వైద్య వికాస మార్గదర్శి, సేవా దార్శనికుడు డాక్టర్ యార్లగడ్డ శ్రీ కృష్ణమూర్తి

బాపట్ల ప్రాంతాన్ని ఒక అద్భుతమైన విద్యా హబ్‌గా మార్చడంలో అసాధారణ పాత్ర పోషించిన మహనీయుడు, బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ శ్రీ కృష్ణమూర్తి నిస్వార్థ సేవా ప్రస్థానం నేటి తరానికి ఆదర్శప్రాయం. గత శతాబ్దపు మధ్యకాలంలో బాపట్ల పరిసర ప్రాంతాల్లో విద్యా, వైద్య సదుపాయాలు అత్యంత పరిమితంగా ఉన్న తరుణంలో.. ఆయన చూపిన దార్శనికత ఆ ప్రాంత భవిష్యత్తును పూర్తిగా మార్చివేసింది. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా, విద్యా వికాసమే పరమావధిగా జీవించిన ఆయన కృషి ఫలితంగానే నేడు బాపట్ల పట్టణం ఉన్నత విద్యా రంగంలో ఒక విశిష్ట స్థానాన్ని సంతరించుకుంది. గతంలో బాపట్ల, ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కాలేజీ విద్య కోసం లేదా టెక్నికల్ కోర్సుల కోసం గుంటూరు, విజయవాడ, తెనాలి వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. అదే సమయంలో వైద్య సదుపాయాల కోసం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో.. వృత్తిరీత్యా వైద్యుడైన డాక్టర్ యార్లగడ్డ శ్రీ కృష్ణమూర్తి కేవలం క్లినిక్‌కే పరిమితం కాకుండా.. సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించారు. నిరుపేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు స్థానికంగానే నాణ్యమైన విద్య, వైద్యం అందాలనే సంకల్పంతో ఆయన అడుగులు వేశారు. ఈ క్రమంలోనే 196లో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ఆవిర్భవించింది. ఈ సంస్థకు ఆయనే తల్లివేరుగా నిలిచి, తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. సొసైటీ స్థాపించిన తొలినాళ్లలో అనేక ఆర్థిక ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ.. డాక్టర్ శ్రీ కృష్ణమూర్తి వెనకడుగు వేయలేదు. తన సొంత నిధులను భారీగా వెచ్చించడమే కాకుండా.. తన బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల నుండి విరాళాలు సేకరించి విద్యా సంస్థలను కాపాడారు. ప్రస్తుత కాలంలో విద్యా సంస్థలను వ్యాపార మార్గాలుగానో, రాజకీయ ప్రయోజనాల కోసమో ఉపయోగించుకునే ధోరణి ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ.. నాటి రోజుల్లో ఆయన ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం సేవా దృక్పథంతోనే ఈ విద్యా సామ్రాజ్యాన్ని నిర్మించడం విశేషం. బాపట్ల ఎడ్యుకేషన్

బ పట ల వ ద య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in