
ప్రముఖ బుల్లితెర నటి సురభి జ్యోతి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తనకు పాప పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. జూన్ 13న తనకు కుమార్తె జన్మించినట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. మా ఇంటికి కుమార్తె వచ్చేసింది.. ఈ సమయంలో మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయాయని పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు, స్నేహితులు సురభికి అభినందనలు చెబుతున్నారు. కాగా.. సురభి జ్యోతి బాలీవుడ్లో 'ఖుబూల్ హై' అనే సీరియల్‌తో బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత నాగిని-3 సీరియల్స్‌తో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను గర్భవతి అని ప్రకటించిన బుల్లితెర భామ తాజాగా బిడ్డకు వెల్కమ్ చెప్పింది. ఆమె తన ప్రియుడు సుమిత్ సూరిని అక్టోబర్ 27, 2024న వివాహం చేసుకుంది. వీరి వివాహం ఉత్తరాఖండ్‌లోని ఆహానా రిసార్ట్‌లో గ్రాండ్‌గా జరిగింది. కాగా.. ఆమె భర్త సుమిత్ రిషికేశ్ నటుడిగా మాత్రమే కాదు.. నిర్మాత కూడా రాణిస్తున్నారు. పలు వాణిజ్య ప్రకటనలలో నటించాడు. అంతేకాకుడా గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన 'వార్నింగ్' చిత్రంతో బాలీవుడ్లో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 'ఖత్రోన్ కే ఖిలాడి' 4వ సీజన్లో కూడా కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు) కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో హీరోయిన్ లయ (ఫొటోలు) Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 14- 21) మూడు ముళ్ల బంధానికి పద్నాలుగేళ్లు..ముచ్చటగా ముగ్గురు పిల్లలు (ఫోటోలు) కెప్టెన్ అవ్వగానే రేంజ్ మారింది.. ముంబైలో శ్రేయస్ ఇంటి అద్దె తెలిస్తే షాక్ అవ్వాల్సిందే తల్లికి ఎగనామం.. బిడ్డలకు పంగనామం.. చేతులెత్తేసిన చంద్రబాబు