
విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజీ నిర్మించిన చిత్రం ‘వంద దేవుళ్ళు’. ఈ మూవీలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధీషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్ ముఖ్య పాత్రలను పోషించారు. ‘బిచ్చగాడు’ తరువాత దర్శకుడు శశితో విజయ్ ఆంటోని చేసిన ఈ చిత్రం జూన్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మేరకు సోమవారం నాడు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల, దర్శకుడు త్రినాథరావు నక్కిన ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో.. విజయ్ ఆంటోని మాట్లాడుతూ .. ‘శశి గారు 20 ఏళ్ల నన్ను మ్యూజిక్ దర్శకుడిగా పరిచయం చేశారు. పదేళ్ల క్రితం శశి గారు ‘బిచ్చగాడు’ చిత్రంతో హీరోగా నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ‘వంద దేవుళ్ళు’ అంటూ మేం రాబోతోన్నాం. శశి గారు కథ చెప్పిన తరువాత నేను ఎంతో ఏడ్చేశాను. నాకు కన్నీళ్లు మాత్రం ఆగలేదు. నా పాత్ర చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. ‘బిచ్చగాడు’ నుంచి నాతో ప్రయాణిస్తున్న భాష్య శ్రీ గారికి థాంక్స్. శశి గారు ఈ మూవీతో కొత్త టెక్నికల్ టీంను పరిచయం చేశారు. ‘వంద దేవుళ్ళు’ మూవీని సుబ్బారెడ్డి గారు, మైత్రి శశి గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నా నిర్మాత ఫాతిమా గారికి థాంక్స్. జూన్ 19న రాబోతోన్న మా ‘వంద దేవుళ్ళు’ తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘‘వంద దేవుళ్ళు’ మూవీని ఆల్రెడీ నేను చూశాను. శశి గారు తీసిన ‘శ్రీను’ మూవీ చూసి నేను వెక్కి వెక్కి ఏడ్చాను. ఆయన ‘బిచ్చగాడు’ లాంటి గొప్ప సినిమాని తీశారు