
'విజయ్ ఆంటోని చేసే ప్రతీ సినిమాలో అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. దర్శకుడు, హీరో, నిర్మాత, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఆయనలో ఇంత ప్రతిభ ఉన్నా.. అన్నింటికంటే మంచి వ్యక్తి ఆయన. కలిసి మాట్లాడాక ఆయనపై మరింత గౌరవం పెరిగింది. 'విజయ్ ఆంటోని (Vijay antony) చేసే ప్రతీ సినిమాలో అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. దర్శకుడు, హీరో, నిర్మాత, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఆయనలో ఇంత ప్రతిభ ఉన్నా.. అన్నింటికంటే మంచి వ్యక్తి ఆయన. కలిసి మాట్లాడాక ఆయనపై మరింత గౌరవం పెరిగింది. సినిమా ఎంత ఎమోషనల్‌గా ఉంటుందో.. అంతే వినోదాత్మకంగా ఉంటుంది. ఆలోచన రేకెత్తించేలా సినిమా ఉంటుంది. అమ్మను కలిగిన ప్రతీ ఒక్కరూ ‘వంద దేవుళ్ళు’ (Vanda devullu) సినిమాని చూడాలి' అని నిహారిక కొణిదెల అన్నారు. విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధీషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘వంద దేవుళ్ళు’. ‘బిచ్చగాడు’ తరువాత దర్శకుడు శశితో విజయ్ ఆంటోని చేసిన సినిమా ఇది. ఈ నెల 19న రిలీజ్ కాబోతోంది. సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిహారిక కొణిదెల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ 'శశి 20 ఏళ్ల క్రితం నన్ను మ్యూజిక్ దర్శకుడిగా, పదేళ్ల క్రితం ‘బిచ్చగాడు’ చిత్రంతో హీరోగా కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ‘వంద దేవుళ్ళు’ అంటూ మేం రాబోతోన్నాం. శశి కథ చెప్పిన తరువాత నేను ఎంతో ఏడ్చేశాను. నాకు కన్నీళ్లు మాత్రం ఆగలేదు. నా పాత్ర చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. ‘బిచ్చగాడు’ నుంచి నాతో ప్రయాణిస్తున్న భాష్య శ్రీ గారికి థాంక్స్. ‘వంద దేవుళ్ళు’ మూవీని సుబ్బారెడ్డి గారు, మైత్రి శశి గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. జూన్ 19న రాబోతోన్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుంది' అని అన్నారు. నిహారిక కొణిదెల