
Telugu Times•12 Jul 2026
బెంగాల్ ఫలితాలను ఇక్కడా పునరావృతంతెలంగాణ పార్టీ కేడర్‌కు,బెంగాల్ (Bengal)లో బీజేపీ కార్యకర్తలు స్ఫూర్తి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు (Ramchander Rao) అన్నారు. జనసంఘ్ స్థాపకులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ (Syama Prasad Mukherjee) బలిదాన్ దివ్‌స (వర్ధంతి) సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ బెంగాల్ ఫలితాలను ఇక్కడా పునరావృతం చేసే దిశగా పార్టీ కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir)ను భారత్‌లో విలీనం చేయడం కోసం శ్యామాప్రసాద్ ముఖర్జీ తన ప్రాణాలనే త్యాగం చేశారన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లలో బీజేపీ కార్పొరేటర్లు ఎక్కువ సంఖ్యలో గెలిచేలా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు