బంగ్లాదేశ్ కు భారత్ గుడ్ న్యూస్
Actor ProfileActor

బంగ్లాదేశ్ కు భారత్ గుడ్ న్యూస్

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
బంగ్లాదేశ్ కు భారత్ గుడ్ న్యూస్
Sakshi24 Jul 2026
బంగ్లాదేశ్ కు భారత్ గుడ్ న్యూస్

ఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు రెండేళ్లుగా నిలిపివేసిన టూరిస్ట్ వీసాల జారీని భారత్ తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. జూన్ 28 (ఆదివారం) నుంచి బంగ్లాదేశ్ పౌరుల నుంచి పర్యాటక వీసా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఢాకాలోని భారత హై కమిషన్ ప్రకటించింది. ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ మెరుగుపడుతున్నాయనే సంకేతంగా భావిస్తున్నారు. ఢాకాలోని ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ (IVAC) భారత హై కమిషనర్‌ దినేశ్ త్రివేది సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రారంభ దశలో ఢాకా, రాజ్‌షాహీ, చిట్టగాంగ్, సిల్హెట్, ఖుల్నా నగరాల్లోని ఐదు వీసా కేంద్రాల ద్వారా టూరిస్ట్ వీసా దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను మరిన్ని కేంద్రాలకు విస్తరిస్తామని వెల్లడించారు. కాగా, దినేశ్ త్రివేది ఇటీవలే బంగ్లాదేశ్‌లో భారత హై కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్‌కు తన అధికార పత్రాలను సమర్పించిన కొద్ది గంటలకే ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని ఆయన తెలిపారు. ఎందుకు నిలిపివేశారు? 2024లో బంగ్లాదేశ్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ విద్యార్థి ఉద్యమాలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో భారత దౌత్య కార్యాలయాలు, వీసా కేంద్రాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవడంతో భారత్ సాధారణ టూరిస్ట్ వీసాల జారీని నిలిపివేసింది. అయితే వైద్య చికిత్స, అత్యవసర కుటుంబ అవసరాలు, విద్య, వ్యాపార అవసరాలకు సంబంధించిన పరిమిత వీసా సేవలు మాత్రం కొనసాగించబడుతున్నాయి. ఇదిలా ఉండగా, భారత్.. బంగ్లాదేశ్ పౌరులకు అత్యధికంగా వీసాలు జారీ చేసే దేశాల్లో ఒకటి. కరోనా తర్వాత కూడా వీసా సేవలు పునరుద్ధరించబడినప్పటికీ 2024 రాజకీయ అశాంతి కారణంగా టూరిస్ట్ వీసాలపై పరిమితులు కొనసాగాయి. తాజాగా

బంగ్లాదేశ్ కు భారత్ గుడ్ న్యూస్..! పాక్, చైనా దూకుడుకు కళ్లెం
Oneindia Telugu21 Jul 2026
బంగ్లాదేశ్ కు భారత్ గుడ్ న్యూస్..! పాక్, చైనా దూకుడుకు కళ్లెం

ఒకప్పుడు పాకిస్తాన్ తూర్పు భాగాన్ని విడదీసి బంగ్లాదేశ్ (Bangladesh) ఏర్పాటు చేసిన భారత్ (India)కు కొంతకాలంగా ఆ దేశంతో సంబంధాల్లో తేడా వచ్చేసింది. ముఖ్యంగా షేక్ హసీనాను అక్కడ జెన్ జీ ఉద్యమం గద్దె

బ గ ల ద శ క భ రత గ డ న య స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in