
బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి అక్షరాలా కాసుల వర్షం కురిసింది. సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) 2020-21 సిరీస్-3 ఇన్వెస్టర్లు ఊహించని రీతిలో భారీ లాభాలను అందుకోబోతున్నారు. ఈ సిరీస్కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా ప్రిమెచ్యూర్ రిడంప్షన్ ధరను ప్రకటించింది. జూన్ 16, 2026 నుంచి ఈ బాండ్లను ముందస్తుగా రీడీమ్ చేసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. గడచిన మూడు ట్రేడింగ్ రోజుల్లోని బంగారం ముగింపు ధరల సగటు ఆధారంగా.. ఈ విడత ప్రిమెచ్యూర్ రిడంప్షన్ ధరను గ్రాముకు రూ.14,774 గా ఆర్బీఐ నిర్ణయించింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, సావరిన్ గోల్డ్ బాండ్లు జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్లు పూర్తయిన తర్వాత, వడ్డీ చెల్లింపు తేదీల్లో ప్రిమెచ్యూర్ రిడంప్షన్కు అవకాశం ఉంటుంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించిన రేట్ల ప్రకారం... రిడంప్షన్ తేదీకి ముందు ఉన్న మూడు వ్యాపార రోజుల్లో 999 స్వచ్ఛత (24 క్యారెట్ల) బంగారం ముగింపు ధరల సాధారణ సగటును పరిగణనలోకి తీసుకొని ఈ ధరను ఖరారు చేశారు. ఈ సిరీస్ జారీ చేసిన సమయంలో ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు గ్రాముకు రూ.50 తగ్గింపుతో రూ.4,627 లభించగా, ఆఫ్-లైన్ ఇన్వెస్టర్లకు రూ.4,677 గా ఉంది. ప్రస్తుత రిడంప్షన్ ధర రూ.14,774గా ఉంది. దాంతో నికరంగా 215.88% శాతం లాభం చేకూరినట్లయింది. గమనిక: ఈ లాభం బాండ్లపై లభించిన 2.5% వార్షిక వడ్డీ భాగం కాకుండా కేవలం బంగారం ధరల పెరుగుదల ద్వారా వచ్చిన నికర లాభం మాత్రమే. ఈ లెక్కన 2020 జూన్లో ఈ బాండ్లలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన ఆన్లైన్ ఇన్వెస్టర్ ప్రస్తుత పెట్టుబడి విలువ ఏకంగా రూ.3.19 లక్షలకు పైగా పెరిగింది. దీనికి అదనంగా గడచిన ఐదేళ్లలో ఏటా లభించిన 2.5 శాతం వడ్డీ ఆదాయం అదనం. ఈ ఏడాది ఏప్రిల్ 1